కుప్పకూలిన నేవీ హెలికాప్టర్, ముగ్గురు సిబ్బంది సేఫ్
చెన్నై: తమిళనాడులో ఓ నేవీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని తెలుస్తోంది. భారత నావికా దళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ సోమవారం కుప్పకూలిపోయింది.
చెన్నైకి సమీపం అరక్కోణంలోని ఐఎన్‌ఎస్ రాజాలి నావికాస్థావరం దగ్గరలో చేతక్ సీహెచ్ 442 కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదం నుంచి ముగ్గురు కూడా సురక్షితంగా బయటపడ్డారని నావికాదళ అధికారులు తెలిపారు.

హెలికాప్టర్ శిక్షణలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. క్రాష్‌ల్యాండ్ కావడంతో ప్రధాన, వెనుక భాగంలో ఉండే రోటర్స్ దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం పైన దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications