బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఇండియన్ నేవీ
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం భారత నావికా దళం, డీఆర్డీవో ఆధ్వర్యంలో అరేబియా సముద్రంలో నిర్వహించిన ఈ క్షిపణి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లింది. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని ఇండియన్ నేవీ ప్రకటించింది.
కోల్‌కతా శ్రేణి క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక ఈ ప్రయోగానికి వేదికగా నిలిచింది. పరీక్షించిన ఈ క్షిపణిని మేడ్-ఇన్-ఇండియా సీకర్, బూస్టర్‌తో అమర్చారు. కాగా, సముద్ర తలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేధించే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది.

క్షిపణుల్లో స్వదేశీ తయారీ క్షిపణుల సంఖ్యను పెంచేందుకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ నిరంతరాయంగా కృషి చేస్తోందని ఇండియన్ నేవీ అధికారులు తెలిపారు.
#IndianNavy’s successful precision strike in the #ArabianSea by ship launched #BrahMos missile with @DRDO_India designed #Indigenous Seeker & Booster reinforces its commitment towards #AatmaNirbharta.#AatmaNirbharBharat@DefenceMinIndia @PMOIndia @IN_WNC @IN_WesternFleet pic.twitter.com/yErzO2Iout
— SpokespersonNavy (@indiannavy) March 5, 2023
కోల్‌కతాలోని మిసైల్ డిస్ట్రాయర్ వార్‌షిప్ నుంచి ఈ బ్రహ్మోస్ మిసైల్‌ని ప్రయోగించారు. సీకర్, బూస్టర్‌తో కూడిన ఈ క్షిపణి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుందని నేవీ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications