చిన్నారులపై లైంగిక వేధింపులు.. అమెరికాలో భారత సంతతి పైలట్ అరెస్ట్..
భారత సంతతికి చెందిన పైలట్ అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. లైంగిక వేధింపుల కేసులో అతడు అరెస్ట్ కావడం గమనార్హం. అమెరికాలోని డెల్టా ఎయిర్ లైన్స్ సంస్థలో కో- పైలట్ గా విధులు నిర్వర్తిస్తున్న భారత సంతతి వ్యక్తి రుస్తోమ్ భాగ్ వాగర్(34) ను విమానంలోనే అరెస్ట్ చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ల్యాండింగ్ అయిన 10 నిమిషాల వ్యవధిలోనే విమానం కాక్ పిట్ లో ఉన్న రుస్తోమ్ ను కస్టడీలోకి తీసుకున్నారు అధికారులు. ఆయన ఓ చిన్నారిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
యూఎస్ఏ టుడే వార్తా సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ టీమ్, కోంట్రా కోస్టా కౌంటీ షెరిఫ్ డిపార్ట్ మెంట్, ఏజెంట్స్ సంయుక్తంగా డెల్టా విమానం 2809 మినియా పోలిస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో లో ల్యాండింగ్ అయిన నేపథ్యంలో వెంటనే 10 నిమిషాల వ్యవధిలోనే కాక్ పిట్ లోకి దూరి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి ఇంకా ప్రయాణికులు విమానంలో ఉన్నారు. గన్స్ , బ్యాడ్జెట్స్ తో కొంత మంది ఏజెంట్స్ తమను నెట్టుకుంటూ వచ్చి పైలట్ రుస్తుమ్ ఉన్న కాక్ పిట్ లోకి దూసుకెళ్లినట్లు విమాన ప్రయాణికులు తెలిపారు.

మరోవైపు రుస్తోమ్ కో- పైలట్ ఈ ఘటనపై స్పందిస్తూ.. అధికారుల చర్య తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. రుస్తోమ్ అరెస్ట్ అవుతాడని అనుకోలేదని తెలిపాడు. ఇక డెల్టా ఎయిర్ లైన్స్ లో విధులు నిర్వర్తిస్తున్న రుస్తోమ్ గతంలో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఈ కేసుపై ఏప్రిల్ నుంచి విచారణ జరుగుతోంది. తాజాగా రుస్తోమ్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై డెల్టా ఎయిర్ లైన్స్ స్పందించింది. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలను తాము సహించమని.. ఈ కేసులో అధికారులకు తమ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందని తెలిపింది. తాము రుస్తోమ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications