పోలీసాఫీసర్ చొక్కా చించిన క్రికెటర్ షమీ బ్రదర్, అరెస్ట్

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ మొహమ్మద్ షమి సోదరుడు పోలీసులతో వాగ్వాదానికి దిగి అరెస్టయ్యాడు. పేసర్ షమి సోదరుడి పేరు మొహమ్మద్ హసీబ్. ఇతను ఆవులు దొంగతనం చేస్తున్న వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో పోలీసులతో వాగ్వాదానికి దిగి అరెస్టయ్యాడు.

తన వర్గానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను షమీ సోదరుడు నిలువరించాడు. వారితో వాగ్వాదానికి దిగడమే కాకుండా దాడికి కూడా పాల్పడ్డాడు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి చొక్కా చిరిగింది. పోలీసులు హసీబ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Indian pacer Mohammed Shami's brother arrested over physical assault with police

మహమ్మద్ షమీ సొంతూరు అమ్రోహలో గోవధ జరుగుతోందన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని విచారించేందుకు పోలీసులు వెళ్లారు. విషయం తెలుసుకున్న హసీబ్.. అక్కడికి వెళ్లి గోవధ, గోవుల అక్రమ తరలింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని వదిలి పెట్టాలని పోలీసులతో వాదనకు దిగాడు.

ఈ క్రమంలో పోలీసులపై దాడి చేశాడు. పోలీసులతో హసీబ్ వాగ్వాదం చేస్తుండగా... ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, మరికొందరు నిందితులతో కలిసి పరారయ్యాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు హసీబ్, అతడి మిత్ర బృందంపై కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+