ఏసీలో ప్రయాణించేవారికి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
రైలులో ప్రయాణం చేసేటప్పుడు ప్రతిసారీ రిజర్వేషన్ దొరుకుతుందనే నమ్మకం ఉండదు. కొన్నిసార్లు RAC అందుబాటులో ఉంటుంది. క్యాన్సిల్ ఎగైనెస్ట్ రిజర్వేషన్... అంటే వేరొకరితో సీటును పంచుకోవాల్సి ఉంటుంది అని అర్థం. ఇప్పుడు RAC టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులకు AC కోచ్‌లో పూర్తి బెడ్ రోల్ కిట్‌ను అందజేస్తున్నారు. ఈమేరకు రైల్వే ప్రకటన చేసింది.
టికెట్‌లో బెడ్‌రోల్ కిట్‌కు చార్జీలు తీసుకోవడంవల్ల రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా తమ టిక్కెట్‌ను రద్దు చేసుకున్నప్పుడు ఆర్‌ఏసీలో సీటు దొరుకుతుంది. ఒక సీటులో ఇద్దరు కలసి ప్రయాణిస్తున్నట్లయితే సగం బెడ్ రోల్ కిట్ మాత్రమే ఇచ్చేవారు. మారిన నిబంధనల ప్రకారం ఏసీ కోచ్‌లో RAC టికెట్ ఉంటే మొత్తం బెడ్ రోల్ కిట్ ఇవ్వనున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ఎంతో సౌకర్యం కలగనుంది. RAC టిక్కెట్లకు సంబంధించి రైల్వే బోర్డు 2017 సంవత్సరంలో AC కోచ్‌లలో బెడ్ రోల్ అందించే సౌకర్యాన్ని ప్రారంభించింది. RACపై ప్రయాణించేవారికి రెండు బెడ్‌షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, ఒక టవల్‌ను బెడ్‌రోల్‌లో ఇచ్చారు. ఇకనుంచి రెండు దుప్పట్లు, రెండు బెడ్‌షీట్లు, రెండు దిండ్లు, రెండు టవల్స్ ఇవ్వనున్నారు.

ఏసీలో ప్రయాణం చేయడంవల్ల జర్నీ చేసి అలసిపోయామనే ఫీల్ కలగదు. దీనివల్లే చాలామంది ఏసీ బోగీల్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతుంటారు. అయితే టికెట్ ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇటీవలే ప్రవేశపెట్టిన వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు మొత్తం ఏసీతోనే ఉంటాయి. ఛార్జీలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏసీ బోగీలు లేకుండా అమృత్ భారత్ పేరుతో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications