మనకు మరో వందే భారత్- రూట్ ఇదే

Vande Bharat express: దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. కొత్త కొత్త మార్గాల్లో వాటిని నడిపిస్తోంది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 66 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది.

Indian Railways is all set to launch 4 more Vande Bharat Express trains starting from Pune

సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు. ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వీటి సంఖ్యను మరింత పెంచుతోంది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది.

ఈ పరిస్థితుల మధ్య మరో నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. మహారాష్ట్ర పుణే స్టేషన్‌ను కేంద్రంగా చేసుకుని ఈ నాలుగు రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తాయి. వాటిని ఎప్పుడు ప్రారంభించాలనేది రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా ఖరారు చేయలేదు.

ప్రస్తుతం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటోంది. ఇది తొలగిపోయిన వెంటనే ఈ రైళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా పూర్తవుతున్నాయి.

ఈ నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఒకటి- సికింద్రాబాద్‌కు రానుంది. పుణే నుంచి సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించనుంది. మిగిలినవి.. పుణే- షెగావ్, పుణే- వడోదర, పుణే- బెళగావి మధ్య రాకపోకలు సాగిస్తాయి. వాటి షెడ్యూల్, టైమ్ టేబుల్, హాల్ట్ స్టేషన్ల వంటి వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

ప్రస్తుతం పుణే నుంచి కొల్హాపూర్ మధ్య వందే భారత్ రైలు అందుబాటులో ఉంటోంది. హుబ్లీ నుంచి ముంబై వెళ్లే మరో ఎక్స్‌ప్రెస్ పుణే మీదుగా వెళ్తుంది. వీటికి అదనంగా కొత్తగా మరో నాలుగు ఎక్స్‌ప్రెస్‌లు వచ్చి చేరనున్నాయి. పుణే- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఇప్పటివరకు అందుబాటులో లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+