వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే రక్షణకు ప్రత్యేక కమాండోలు... కశ్మీర్‌కు మొదటి బ్యాచ్...

|
Google Oneindia TeluguNews

రైల్వేను ఉగ్రవాదులతోపాటు ఆసాంఘీక కార్యకాలపాలు చర్యల నుండి కాపాడేందుకు ఇక నుండి రైల్వే శాఖ ప్రత్యేక కమాండోలను తయారు చేసింది. కోరాస్ అనే కమాండో వ్యవస్థకు రూపకల్పన చేసింది. వారిలో శిక్షణ పోందిన వారికి అత్యధునిక ఆయుధాలను అందించడంతో పాటు అధునిక సాంకేతికను అందించింది. మొత్తం రైల్వేకు,ఉగ్రవాదులతోపాటు టెర్రరిస్టులు, ఇతర అసాంఘిక ఎలాంటీ విపత్తు వచ్చిన ఎదుర్కునేందుకు వెంటనే రైల్వే రక్షక కమాండోలు రంగంలోకి దిగనున్నారు.

రైల్వే రక్షణకు అత్యాధునిక కమాండోలు..

రైల్వే రక్షణకు అత్యాధునిక కమాండోలు..

రైల్వే కమాండోలుగా శిక్షణ పూర్తి చేసుకున్న యూనిట్‌ను రైల్వే మంత్రి పియూష్ గోయల్ ప్రారంభించారు. కాగ వారిని స్వాంతత్ర్య దినోత్సం నుండే రంగంలోకి దింపనుంది.ఇందుకోసం 1200 మంది కమాండోలను సిద్దం చేశారు. కాగా వీరిని మొదటి సారిగా కశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే రక్షణ కోసం వినియోగించనున్నట్టు రైల్వే ముఖ్య అధికారులు వివరించారు. కాగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్ నిర్మాణం సరైన సమయంలో పూర్తి చేసేందుకు కమాండోలు సహకరించనున్నట్టు అధికారులు ప్రకటించారు.

కశ్మీర్‌లో నిర్మాణం జరుగుతున్న రైల్వే ప్రాజెక్టు

కశ్మీర్‌లో నిర్మాణం జరుగుతున్న రైల్వే ప్రాజెక్టు

కాగా కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లోని కాట్ర నుండి బనిహాల్ వరకు మొత్తం 105 కి.మీ మేర ఉన్న రైల్వే మార్గంలో 95శాతం మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంది. దీంతో ఈ ప్రాజెక్టును 2023 కల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగానే చినాబ్ నదిపై కూడ ఓ వంతెనను నిర్మిస్తున్నారు. కాగా ఈ రైల్వే కశ్మీర్‌తో పాటు ఇతర ఇండియా రాష్ట్రాల ప్రజలకు ఎక్కువగా చినాబ్ నదిపై నిర్మాణం చేపడుతున్నారు.

కశ్మీర్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోకి కమాండోలు..

కశ్మీర్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోకి కమాండోలు..

ఈనేపథ్యంలోనే కశ్మీర్‌లో నెలకోన్న ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న సంధర్భంలోనే ప్రత్యేక కమాండోల వ్యవస్థ చాల ఉపయోగపడుతుందని, రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు కమాండోలకు ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో పాటు, అధిక జీతాలు, ఎక్కువ సౌకర్యాలు, అధునికతతో కూడిన ఆయుధాలు సైతం సమకూర్చుతున్నట్టు వెళ్లడించారు.కాగా కశ్మీర్‌తో పాటు తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉండే చత్తీస్‌ఘడ్,ఒడిశా,వెస్ట్ బెంగాల్,జార్ఖండ్,బిహార్ రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ రైల్వే కమాండోలను భవిష్యత్‌లో అందించనున్నారు.

English summary
Indian Railways will deploy its first commando unit - Commandos for Railway Safety (CORAS), to ensure timely completion of rail projects in Kashmir that will connect the valley with rest of India, the chief of the Railway Protection Force (RPF) said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X