రికార్డు స్థాయిలో క్షీణించిన రూపాయి: డాలర్‌తో రూ. 74.22
ముంబై: రూపాయి మారకం విలువ శుక్రవారం రికార్డు స్థాయిలో క్షీణించింది. నేటి ట్రేడింగ్ ప్రారంభంలోనే డాలర్ మారకంలో రూపాయి భారీగా నష్టపోయింది. ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం రూపాయి అత్యంత కనిష్టస్థాయి రూ.74.22కు పతనమైంది.
అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రూపాయిని కాపాడటానికి భారత ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది.

తాజాగా ఆర్బీఐ పాలసీ అయినా రూపాయి విలువను కాపాడుతుందని అభిప్రాయాలు వ్యక్తమైనా అదీ జరగలేదు. అమెరికా ఫెడ్ రేట్లు పెంచడం, విదేశీ నిల్వలు తరలిపోకుండా ఉండేందుకు.. రేపో రేటును ఆర్బీఐ పెంచుతుందని విశ్లేషకులు భావించారు. కానీ, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications