పాకిస్తాన్, బైసాకి ఉత్సవాల్లో ఇండియన్స్ ,ప్రత్యేక రైలులో పయనం

న్యూఢిల్లీ : ఓవైపు భారత్ పాకిస్థాన్ ల మధ్య పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్త వాతవరణం నెలకోని ఉండగా, మరోవైపు ఇండియా, పాకిస్థాన్ మధ్య సంప్రాదాయ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఇండియాకు చెందిన సిక్కు యాత్రికులు పాకిస్తాన్ లోని జరిగే బైసాకి ఉత్సవాలకు హజరయ్యేందుకు సుమారు 2200 మంది వరకు లాహోరు వెళ్లారు.

పంజా సాహిబ్ గురద్వారలో బైసాకి ఉత్సవాలు

పంజా సాహిబ్ గురద్వారలో బైసాకి ఉత్సవాలు

ఓవైపు భారత్ పాకిస్థాన్ ల మధ్య పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్త వాతవరణం నెలకోని ఉండగా, మరోవైపు ఇండియా, పాకిస్థాన్ మధ్య సంప్రాదాయ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ క్రిడలకు తమకు ఏం సంబంధం లేదన్నుట్టుగా ఇండియా, పాకిస్థాన్ ప్రజలు కలిసి సంప్రాదాయ ఉత్సవాల్లో పాలు పంచుకుంటున్నారు.ఈనేపథ్యంలోనే తాజగా ఇండియాకు చెందిన సిక్కు యాత్రికులు పాకిస్తాన్ లోని జరిగే బైసాకి ఉత్సవాలకు హజరయ్యేందుకు సుమారు 2200 మంది లాహోరు కు వెళ్లారు.

కొత్త పంటల సమయంలో బైసాకి ఉత్సవాలు

కొత్త పంటల సమయంలో బైసాకి ఉత్సవాలు

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల హసన్ అబ్దల్ నగరంలో ఉన్న పంజా సాహిబ్ గురుద్వార లో ప్రతి సంవత్సరం కోత్త పంటలు వచ్చే సమయంలో బైసాకి ఉత్సవాలకు ఉత్సవాలు నిర్వహిస్తారు.కాగా ఈ ఉత్సవాలకు ఇండియా నుండి పెద్ద ఎత్తున సిక్కు మతస్థులు పాల్గోంటారు.

పాకిస్థాన్ చేరుకున్న సిక్కు యాత్రికులు

పాకిస్థాన్ చేరుకున్న సిక్కు యాత్రికులు

ఇందులో భాగంగానే ఈరోజు వారంత ప్రత్యేక రైలులో రావల్పిండి కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆటోక్ జిల్లా హసన్ కు చేరుకున్నారు. కాగా వీరికి పాకిస్థాన్ గురుద్వార ప్రబంధక్ కమిటి ప్రెసిడెంట్ సర్ధార్ తార సింగ్ తోపాటు అక్కడ ఉత్సవాలు నిర్వహించే ఈటీపీబీ కమిటి సెక్రటరీలు వారికి స్వాగతం పలికారు. కాగా ఉత్సవంలో పాల్గోనడంతో పాటు అక్కడ గురద్వార లను కూడ సిక్కులు సందర్శిస్తారని వారు తెలిపారు.ఈనేపథ్యంలోనే వారికి ప్రత్యేక సదుపాయాలతోపాటు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడతామని వారు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+