పాకిస్థాన్‌కు ఖైదీగా చిక్కిన భారత జవాన్..బంగారం లాంటి అవకాశం చేజారినట్టే..?
సరిహద్దు భద్రతా దళానికి (BSF) చెందిన ఒక జవాన్ పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లడం జరిగింది. ఈ సంఘటన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో జరిగింది. కాన్‌స్టేబుల్ పీకే సింగ్ అనే జవాన్ పొరపాటున సరిహద్దు దాటారు. అతను కొందరు రైతులతో కలిసి వెళ్తున్నప్పుడు, నీడలో విశ్రాంతి తీసుకోవడానికి ముందుకు వెళ్లగా పాకిస్తాన్ రేంజర్స్ అతడిని పట్టుకున్నారు. జవాన్ యూనిఫామ్‌లో ఉండి, తన సర్వీస్ రైఫిల్‌ను కూడా కలిగి ఉన్నాడు.
అతడిని విడుదల చేయించడానికి ఇరు దేశాల అధికారులు ఫ్లాగ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు.ఇలా పొరపాటున సరిహద్దులు దాటడం గతంలోనూ జరిగిందని అధికారులు తెలిపారు.ఈ సంఘటన, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో చోటుచేసుకుంది.అయితే ఇలాంటి ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి. 2019లో బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత జరిగిన ప్రతిస్పందనలో, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ యొక్క మిగ్-21 బైసన్ యుద్ధ విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది.

పారాచూట్ ద్వారా దిగిన అభినందన్‌ను పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అంతర్జాతీయ ఒత్తిడి మరియు దౌత్యపరమైన ప్రయత్నాల ఫలితంగా, అభినందన్ కేవలం 60 గంటల్లోనే క్షేమంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన చూపిన ధైర్యం మరియు సంయమనం దేశానికి గర్వకారణంగా నిలిచాయి. అయితే పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దేశంలో ఉన్న పాక్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సింధు నదిలో ఇచ్చే వాటాలను సైతం నిలిపిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పాకిస్థాన్ సైతం ఇండియాకు ధీటుగానే సమాధానం ఇస్తుంది. సింధు జాలాలను నిలుపుదల చేస్తే యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ యుద్ధ సన్నాహాలకు రెడీ అవుతుంది.
ఆర్మీ సైన్యానికి సెలవులు కూడా రద్దు చేసింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఇలాంటి తరుణంలో ఇండియన్ పాకిస్థాన్‌కు ఖైదీగా చిక్కడం భారత్‌కు కాస్తా ఇబ్బందికరమే.అంతర్జాతీయంగా భారత్‌ను దోషిగా చూపించడానికి పాక్ ప్రయత్నాలు చేస్తోంది. తమ దేశంలో అక్రమంగా చొరపడ్డారని ఆ జవాన్‌ను బూచిగా చూపించే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో చిక్కుకున్న భారత జవాన్‌ను తిరిగి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చర్చలు జరుపుతుంది.












Click it and Unblock the Notifications