Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియాలో టాప్-10 రిచెస్ట్ పర్సన్స్... ఫోర్బ్స్ జాబితా

ప్రపంచంలో, ఆయా దేశాల్లో టాప్-100లో, టాప్-50లో, టాప్-20లో, టాప్-10లో నిలిచిన ధనవంతులెవరు? అందుకు కారణాలేంటి? వారు చేసే వ్యాపారాలేంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? తదితర కారణాలతో ప్రతి ఏడాది ఫోర్బ్స్ పత్రిక ఓ జాబితా విడుదల చేస్తుంది. తాజాగా 2024కు సంబంధించి భారతదేశానికి చెందిన ఖరీదైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. టాప్-100 రిచెస్ట్ వ్యక్తుల సంపద ట్రిలియన్ డాలర్లు దాటేసినట్లు వెల్లడించింది. వీరందరి ఆస్తులు కలిపితే 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. మన భారతదేశ రూపాయల్లో చెప్పాలంటే రూ.92 లక్షల కోట్లకు పైగా వీరందరి ఆస్తుల విలువ ఉంటుంది.

జాబితాలో ఏకైక మహిళ
ఇండియాలోని టాప్-10 ఖరీదైన వ్యక్తుల్లో మొదటి స్థానంలో రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ నిలిచారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన సంపద 119.5 బిలియన్ డాలర్లుగా ఉంది. మనదేశ రూపాయల్లో చెప్పాలంటే రూ.10 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ జాబితాలో రెండో స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. ఆయన సంపద 116 బిలియన్ డాలర్లుగా ఉంది. మన దేశ రూపాయల్లో ఇది 9.75 లక్షల కోట్ల రూపాయలకు సమానం. మూడో స్థానంలో మహిళ నిలిచారు. ఆమే సావిత్రి జిందాల్. ఆమె సంపద 43.7 మిలియన్ డాలర్లుగా ఉంది.

indian top 10 richest persons according to forbes list

పదో స్థానంలో బజాజ్
ఈ జాబితాలో నాలుగోస్థానంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ శివ్ నాడార్ నిలిచారు. ఈయన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని దాతృత్వానికే వెచ్చిస్తారు. ఆయన సంపద 40.2 మిలియన్ డాలర్లుగా ఉంది. సన్ ఫార్మాష్యుటికల్స్‌కు చెందిన దిలీప్ సంఘ్వీ అండ్ ఫ్యామిలీ ఐదో స్థానంలో నిలిచింది. వీరి సంపద 32.4 మిలియన్ డాలర్లుగా ఉంది. ఆరో స్థానంలో డీమార్ట్ చైర్మన్ రాధాకిషన్ దమానీ నిలిచారు. ఈయన సంపద 31.5 డాలర్లు. ఎయిర్ టెల్ భారతీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ ఏడోస్థానంలో నిలవగా వీరి సంపద 30,7 మిలియన్ డాలర్లుగా ఉంది. 24.8 మిలియన్ డాలర్లతో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా ఎనిమిదోస్థానంలో నిలిచారు. తొమ్మిదో స్థానంలో సైరస్ పూనావాలా 24.5 బిలియన్ డాలర్లతో, బజాజ్ ఫ్యామిలీ 23.4 మిలియన్ డార్లతో పదో స్థానంలో నిలిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+