లక్కంటే ఇదీ.. ఒక్క లాటరీతో రూ.12కోట్లు సంపాదించేశాడు..

అబుదాబి బిగ్ లాటరీ టికెట్ (నెంబర్ 44698) ను ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ లాటరీకి నిన్న డ్రా తీయగా కృష్ణన్ ను అదృష్టం వరించింది. అక్షరాల రూ.12కోట్లు ఇప్పుడు లాటరీ ద్వారా అతనికి దక్కబోతున్నాయి.

దుబాయ్: మామూలుగా అయితే ప్రతీ నెలా తనకొచ్చే రూ.1లక్ష జీతంలోంచి ఇంటి లోన్లు చెల్లించుకుంటూ కొద్దో గొప్పో డబ్బులు వెనకేసుకునేవాడు. కానీ భారీ మొత్తంలో అదృష్టం అతన్ని వరించడంతో.. ఇప్పుడతను కోటీశ్వరుడైపోయాడు. ఒకే ఒక్క లాటరీ ఇప్పుడతని జీవితాన్ని మార్చివేసింది.

దుబాయ్ లో పనిచేస్తోన్న శ్రీరాజ్ కృష్ణన్ కొప్పరెంబిల్ అనే వ్యక్తికి రెగ్యులర్ గా లాటరీ టికెట్ కొనడం అలవాటు. అదే క్రమంలో అబుదాబి బిగ్ లాటరీ టికెట్ (నెంబర్ 44698) ను ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ లాటరీకి నిన్న డ్రా తీయగా కృష్ణన్ ను అదృష్టం వరించింది. అక్షరాల రూ.12కోట్లు ఇప్పుడు లాటరీ ద్వారా అతనికి దక్కబోతున్నాయి.

Indian wins over Rs 12 crores in lottery in UAE

దుబాయ్ కరెన్సీ ప్రకారం ఏడు మిలియన్ దిర్హామ్ లు అతని ఖాతాలోకి చేరనున్నాయి. ప్రస్తుతం కృష్ణన్ ఓ షిప్పింగ్ కంపెనీలో కో-ఆర్డినేటర్ గా పనిచేస్తుండగా.. అతని భార్య కూడా దుబాయ్ లోనే ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. మామూలుగా అయితే ప్రతీ ఇంటి లోన్ కోసమే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తున్న కృష్ణన్ లాటరీ తగలడంతో పట్టరాని ఆనందంలో ఉన్నాడు. కేరళలో తమకు సొంతిల్లు ఉందని, దానికి ఇప్పటికీ లోన్ చెల్లిస్తున్నట్లు కృష్ణన్ తెలిపాడు.

లాటరీ తగిలిందని వెంటనే ఇండియా వచ్చేయనని, మరికొద్దిరోజులు ఇక్కడే పనిచేస్తానని అతను చెబుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+