• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాక్‌డౌన్ చెప్పిన సత్యం.. మందు భామలుగా మగువలు..! వైన్ షాపుల్లో మగాళ్లకు గట్టిపోటీ ఇస్తున్న లేడీస్..!

|

హైదరాబాద్ : కాలం మారింది బాసూ.. కన్నెపిల్లల కట్టూ బొట్టూ మారితే కన్నెర్ర చేసే పెద్దలు., ప్రస్తుతం ఆడవాళ్ల మారుతున్న అలవాట్లను చూసి అవాక్కయ్యే పరిస్థితులు తలెత్తాయి. కట్టుబాట్లు, సాంప్రదాయాలు, సంస్కృతులు అనే పద్దతులు పైన భారత మగువలు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మారిన మగువల ఆకాంక్షలను చూస్తుంటే దిమ్మతిరిగి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచం మొత్తం షట్ డౌన్ అయిన నేపథ్యంలో మహిళలు స్వీయ నియంత్రణ పాటిస్తూ కాల గర్బంలో కలిసిపోయిన ఆచార వ్యవహారాలను మళ్లీ అనుసరిస్తారని అందరూ భావించారు. తమ అలవాట్లకు, పాశ్యాత్యదృక్పధానికి లాక్ డౌన్ తాత్కాలిక బ్రేకులు మాత్రమే వేయగలిగిందని మన భారత మగువలు బీరెత్తి చెప్పుకొస్తున్నారు.

  Women Queues At Liquor Shops, Indian Women Giving Much Competition to Men In Alcohol
  మద్యం కోసం మగువలు.. బీర్ల కోసం బారులు తీరిన భామలు..

  మద్యం కోసం మగువలు.. బీర్ల కోసం బారులు తీరిన భామలు..

  వర్కింగ్ వుమెన్ జీవితానికి అలవాటు పడ్డ భారత స్త్రీల అలవాట్లు, సాధారణ గృహిణి అలవాట్లకు ఎంతో భిన్నంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కొంత మంది మహిళలు వంట గదికే అంకితమైతే, వైన్ షాపులే శరణ్యం అంటున్న మహిళల సంఖ్య కూడా గణనీయంగానే పెరిగింది. గత 40 రోజులుగా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో అన్నీ అమ్మకాలను, ముఖ్యంగా మద్యంపై తీవ్ర ఆంక్షలను విధించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాగా మద్యం ఎక్కడా అందుబాటులో లేకపోడంతో అందరూ మద్యం సేవించాలనే అలవాటును కూడా మానుకున్నట్టు తెలుస్తోంది. కరోనా తీవ్రత తగ్గిన కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తివేసి మద్యం అమ్మకాలకు అనుమతులు జారీ చేసాయి. కచ్చితంగా ఇక్కడే దిమ్మతిరిగే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

  పెరిగిన పాశ్చాత్య సంస్కృతి.. మద్యం కోసం కూలైన్లో ఆడ లేడీస్..

  పెరిగిన పాశ్చాత్య సంస్కృతి.. మద్యం కోసం కూలైన్లో ఆడ లేడీస్..

  లాక్ డౌన్ ఆంక్షలను సడలించి మద్యం దుకాణాలు తెరుచుకున్న తరుణంలో మద్యం ప్రియులు షాపుల వద్ద పోటెత్తారు. దాదాపు మూడు కీలో మీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడి మద్యం కొనుగోలు చేసారు తాగుబోతులు. అనేక రాష్ట్రాల్లో వైన్ షాపుల ముందు ఇదే దృశ్యం కనిపించింది. మద్యం కోసం చెకోర పక్షుల్లా ఒక్క మగాళ్లే కాకుండా ఆడవాళ్లు కూడా ఎదురు చూసారన్న అంశం కూడా వెలుగులోకి వచ్చింది. 40రోజుల తర్వాత ఒక్క సారిగి తెరుచుకున్న మద్యం షాపుల ముందు మగాళ్లకు ధీటుగా మహిళలు కూడా క్యూలైన్లో నుంచోవడం విస్మయానికి గురిచోస్తోంది. భయం, బెరుకు, మొహమాటం, ఏమాత్రం సిగ్గు లేకుండా మద్యం షాపుల ముందు మద్యం బాటిళ్లు తీసుకెళ్లడానికి బ్యాగులతో నుంచోవడం ఆశ్యర్యానికి గురిచేసింది.

  వర్కింగ్ ఉమెన్ కొత్త ట్రెండ్.. బీరు, బారు సర్వసాధారణం..

  వర్కింగ్ ఉమెన్ కొత్త ట్రెండ్.. బీరు, బారు సర్వసాధారణం..

  బయటకు తెలియడం లేదు గాని ఈ దేశంలో మహిళల్లో 30 శాతం మందికి పైగా మందు అలవాటు ఉందని నిర్థారణ అవుతోంది. ఇటీవల మందుభామలు బహిరంగంగా మద్యం కొనుగోలు చేయడం బాగా పెరుగుతోంది. ఐటీ, సేవల రంగంలో ఉన్న మహిళలల్లో సోషల్ గ్యాదరింగ్స్ లో భాగంగా ఎక్కువ అలవాటు చేసుకుంటున్నారు. మంచి ఉద్యోగం, నాగరికత, బహుభాషలు తెలిసి స్నేహితులు, తల్లిదండ్రులకు వందల కిలో మీటర్లు దూరంగా ఉండడం వల్ల అమ్మాయిలు మద్యానికి బాగా అలవాటుపడుతున్నట్టు తెలుస్తోంది. ఊరిగాని ఊళ్లో ఏది చేసినా పెద్దడా ఆంక్షలు ఉండవు. అదే సొంతూరిలో కొన్న పరిమితులు ఉంటాయి. అందుకే ఉద్యోగం పేరుతో ఇల్లు వదిలి వచ్చిన మహిలలు ఎక్కువాగా మద్యానికి అలవాటు పడ్డట్టు తెలుస్తోంది.

  మందు షాపులకోసం ఎదురు చూసింది మందుబాబులే కాదు.. మందు భామలు కూడా..

  మందు షాపులకోసం ఎదురు చూసింది మందుబాబులే కాదు.. మందు భామలు కూడా..

  భారత దేశంలో కెల్ల ఐటీ రంగంలో ముందంజలో ఉన్న నగరంగా బెంగళూరు నగరానికి మంచి పేరుంది. లాక్ డౌన్ మరోసారి పొడిగించడంతో రాష్ట్రాలకు వరుసగా ఆదాయం లేకపోతే ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి, మద్యంపైనున్న ఆంక్షలను సడలిస్తూ మద్యం అమ్ముకోవచ్చని కేంద్రం పేర్కొంది. తాజాగా దేశంలో అత్యధిక రాష్ట్రాలు అమ్మకాలు మొదలుపెట్టాయి. దీంతో మందు బాబులతో పాటు మందుభామలు 40 రోజులు ఓపిగ్గా భరించారు. ఇపుడు వారి తాపత్రయం కట్టలు తెంచుకుంది. మగాళ్లకు ధీటుగా మహిళలు మద్యం కోసం ఎగబడ్డ సందర్బాలు చోటుచేసుకున్నాయి. బెంగుళూరులో వైన్ షాపు ముందే కాకుండా వివిధ షాపుల ముందు అమ్మాయిలు క్యూ కట్టడం ఔరా అనిపిస్తోంది.

  English summary
  A similar scenario has appeared in front of wine shops in many states. It was also revealed that not only males but also females were waiting for alcohol. It is astonishing that even women have to stand in queues in front of liquor stores that open once in 40 days.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X