ఉమెన్స్ డే స్పెషల్: భారత చరిత్రలో 'తొలి' మహిళలు..
న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున స్త్రీ శక్తిని అమాంతం ఆకాశానికెత్తేస్తూ ఎంతోమంది స్పందిస్తుంటారు. ప్రభుత్వాలు కూడా ఇది చేశాం.. అది చేశామని బాగానే గొప్పలు చెప్పుకుంటాయి. వాస్తవంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది.
మహిళా దినోత్సవం కేవలం ఉన్నత స్థాయి వర్గాల మహిళలకే పరిమితమైందన్న విమర్శలూ లేకపోలేదు. అట్టడుగు వర్గాలకు చెందిన మహిళల కష్టం 'వుమెన్స్ డే'లో గుర్తించబడుతున్నదా?.. సమాధానం చెప్పడం కష్టమే.

సరే, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నా.. 'ఉమెన్స్ డే' రోజు మహిళా శక్తిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆయా రంగాల్లో తమదైన ముద్రవేసిన నారీమణుల గురించి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది.
మహిళా దినోత్సవం సందర్భంగా రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైద్య, విద్య, క్రీడ, రాజకీయ, సోషల్ సర్వీస్, అధికారులు, న్యాయమూర్తులు ఇత్యాది రంగాల్లో మహిళల సత్తా చూపించిన వనితలను ఒకసారి గుర్తుచేసుకుందాం.
| భారతదేశ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి | ప్రతిభా దేవిసింగ్ పాటిల్ |
| భారత దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి | ఇందిరా ప్రియదర్శిని గాంధీ |
| భారతదేశపు మొట్టమొదటి మహిళా వ్యోమోగామి | కల్పనా చావ్లా |
| భారతదేశపు మొట్టమొదటి సైనికురాలు | పునితా అరోరా/ప్రియా జింగాన్ |
| భారత నేవీలో మొట్టమొదటి మహిళ | సుభాంగి స్వరూప్ |
| ఒలింపిక్స్‌లో భారతదేశపు మొట్టమొదటి మహిళా కిరణం | కరుణం మళ్లీశ్వరి |
| ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారత మహిళ | పి.వి.సింధు |
| మొట్టమొదటి మిస్ వరల్డ్/మిస్ ఇండియా | రీటా ఫెరియా పావెల్ |
| మొట్టమొదటి మిస్ యూనివర్స్ | సుస్మితా సేన్ |
| భారత మొట్టమొదటి మహిళా గాయకురాలు | రాజ్ కుమారి దూబే |
| భారతదేశపు మొట్టమొదటి మహిళా వైద్యురాలు | ఆనంది గోపాల్ జోషి |
| మొట్టమొదటి నోబెల్ అవార్డు పొందిన భారత మహిళ | మదర్ థెరిసా |
| మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ | కిరణ్ బేడీ |
| మొట్టమొదటి మహిళా రైడర్ | రోషిణి శర్మ |
| మొట్టమొదటి మహిళా ఆటో డ్రైవర్ | శీలా డావ్రే |
| టెస్టులో రెండు సెంచరీలు బాదిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ | మిథాలీ రాజ్ |
| ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటి మహిళా ఫ్లైయింగ్ ఆఫీసర్ | అంజలి గుప్తా |
| మొట్టమొదటి సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తి | ఎం.ఫాతిమా బీవి |
| ఇండియన్ ఎయిర్ లైన్స్, మొట్టమొదటి మహిళా పైలట్ | దుర్గా బెనర్జీ |
| ఆస్కార్ పొందిన మొట్టమొదటి భారత నటి | భాను అతయా |
| భారత్ నుంచి మొట్టమొదటి 'వరల్డ్ మిస్టర్&మిసెస్ | అదితి గోవిత్రికర్ |
| యుద్ద విమానంలో మొట్టమొదటి మహిళా పైలట్ | అవని చతుర్వేది |
| మొదటి మహిళా ముఖ్యమంత్రి | సుచేత కృపలాని |
| భారత మొదటి మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి | అన్నా జార్జి |
| ప్రపంచ బాక్సింగ్ పోటీలో గెలుపొందిన భారత మొదటి మహిళ | మేరీ కోమ్ |
| భారతదేశపు మొదటి మహిళా ఆర్మీ కెప్టెన్ | లక్ష్మీ సెహగల్ |
| ఎవరెస్ట్‌ను అధిరోహించిను భారత మొదటి మహిళ | బచేంద్రిపాల్ |












Click it and Unblock the Notifications