లక్కున్నోడు.. అబుధాబి లాటరీలో కోట్లు గెలుచుకున్న భారతీయుడు !!
యూఏఈ లోని అబుధాబిలో నివసిస్తున్న ఓ ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. 'బిగ్ టికెట్ అబుధాబి 280' పేరుతో నిర్వహిస్తున్న లాటరీలో శరవణన్ వెంకటాచలం రూ.60.42 కోట్లు (25 మిలియన్ల దిర్హామ్‌లు) గెలుచుకున్నారు. విషయం బయటికి రావడంతో అదృష్టవంతుడివి బ్రో, లక్కున్నోడు అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అబుధాబిలో పనిచేస్తున్న శరవణన్ అక్టోబర్ 30న '463221' నంబర్ టికెట్ కొనుగోలు చేశారు. నవంబర్ 3న జరిగిన డ్రాలో అదే టికెట్ జాక్‌పాట్‌గా నిలిచింది. శరవణన్ వెంకటాచలం తమిళనాడుకు చెందిన వ్యక్తి. గత దశాబ్ద కాలంగా యూఏఈలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే డ్రా ఫలితాలు ప్రకటించిన వెంటనే షో నిర్వాహకులు రిచార్డ్ శరవణన్ వెంకటాచలంను ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండడంతో మాట్లాడలేకపోయినట్టు స్పష్టం చేశారు. ఈమెయిల్ ద్వారా కూడా ఆయనను సంప్రదిస్తామని తెలిపారు.

'బిగ్ టికెట్ అబుధాబి' లాటరీ 1992లో ప్రారంభమవ్వగా.. ప్రతి నెలా కోట్లు రూపాయల బహుమతులు అందజేస్తుంది. ప్రారంభంలో చిన్న మొత్తాలతో మొదలైన ఈ డ్రా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక బహుమతి విలువ గల నెలవారీ లాటరీగా నిలిచింది. ఒక్కో టికెట్ ధర 500 దిర్హామ్‌లు (సుమారు రూ.11,400) ఉంటుంది. మరోవైపు యూఏఈలో లాటరీపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. దీంతో విజేతలు పన్ను చెల్లించకుండానే పూర్తి మొత్తాన్ని అందుకుంటారు. అదే భారత్‌లో ఎవరైనా ఇంత పెద్ద మొత్తం గెలిస్తే, దాదాపు 30 శాతం ఫ్లాట్ పన్ను, సర్‌చార్జ్, సెస్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
కొనసాగుతున్న భారతీయుల అదృష్టం..
ఇక ఇటీవలి నెలల్లో యూఏఈ లాటరీల్లో భారతీయులు వరుసగా విజయం సాధిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే అబుదాబిలో నివసిస్తున్న ఏపీకి చెందిన అనిల్‌కుమార్ లాటరీ గెలుచుకున్నారు. యూఏఈ లాటరీ చరిత్రలోనే అతిపెద్ద జాక్‌పాట్‌గా నిలిచిన 100 మిలియన్ దిర్హామ్‌లను (సుమారు రూ. 240 కోట్లు) గెలుచుకుని వార్తల్లో నిలిచారు. తన తల్లి పుట్టినరోజునే ఆ నంబరుగా ఎంచుకున్నానని.. అలా లక్ కలిసొచ్చిందని అనిల్ వివరించారు. గెలిచిన డబ్బులో కొంత భాగాన్ని ఛారిటీలకు విరాళంగా ఇస్తానని తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications