Flash back:తాలిబన్ల చెరలో నాడు భారత్ విమానం: వాజ్‌పేయి ఏం చేశారు నాడు ఏం జరిగింది..?
తాలిబన్లు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సమాయత్తం అయ్యారు. ఇదే తాలిబన్లతో భారత్ సైతం చిక్కులు ఎదుర్కోంది. వారి పేరు చెప్పగానే గుర్తొచ్చేది నాటి విమాన్ హైజాక్. భారత్ బంధీలుగా పట్టుకున్న తమ సహచరులను విడుదల చేయటంతో పాటుగా..నగదు డిమాండ్ చేస్తూ విమానం హైజాక్ చేసారు. వారం రోజుల పాటు విమానం లోని ప్రయాణీకులు వారి చెరలో బందీలుగా ఉన్నారు. 1999 డిసెంబర్ 24 న జరిగిన విమానం హైజాక్ ఎపిసోడ్ డిసెంబర్ 31న ముగిసింది.
Recommended Video

ఆ రోజు ఏం జరిగిందంటే...
సాయంత్రం 5గంటలకు భారత గగనతంలోకి విమానం ప్రవేశించగానే అప్పటికే అందులో ఉన్న హైజాకర్లు విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేస్తున్నామని చెప్పి అమృత్ సర్, లాహోర్, దుబాయిల మీదుగా అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌కు తరలించారు. భారత్ ఆధీనంలో ఉన్న తమ సహచరులు 36 మందిని విడుదల చేయాలని డిమాండ్ చేసారు. 200 మిలియన్ డాలర్లు (రూ. 1400 కోట్లు) ఇవ్వాలని షరతు విధించారు. హైజాక్ కు గురైన సీ814 విమానంలో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది సిబ్బంది ఉన్నారు. భారత గగనతలంలోకి రాగానే కాక్‌పిట్ వైపు వచ్చిన ముసుగు ధరించిన మిలిటెంట్లు విమానాన్ని లాహోర్‌కు తీసుకువెళ్లాలని ఆదేశించారు.

అమృత్‌సర్‌లో మిలిటరీ ఆపరేషన్ కు యత్నం..
లేదంటే బాంబుతో విమానాన్ని పేల్చేస్తానని పైలట్ ను బెదిరించారు. అదే సమయంలో సీట్లలో నుంచి లేచి, విమానంలోని నాలుగు వేర్వేరు చోట్ల నిల్చున్న మిలిటెంట్లు ప్రవేశించారు. విమానాన్నిలాహోర్ వైపు మళ్లించాలని కెప్టెన్ దేవీ శరన్ కు మిలిటెంట్లు ఆదేశించారు. అయితే విమానంలో తక్కువ ఇంధనం ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని అమృత్‌సర్‌లో దించారు కెప్టెన్. అయితే అదే సరైన సమయంగా భావించిన భద్రతా దళాలు ఆపరేషన్ కు సిద్దమయ్యారు. వెంటనే పసిగట్టిన హైజాకర్లు ఇంధనం నింపకుండానే విమానాన్ని లాహోర్ తీసుకువెళ్లేలా పైలట్ పై ఒత్తిడి తెచ్చారు. దాంతో చేసేదేమి లేక లాహూర్ కు తీసుకువెళ్లారు. లాహూర్ విమానాశ్రయ అధికారులతో మంతనాలు చేసారు.

కాందహార్ సురక్షిత ప్రాంతంగా..
అయితే వారు ఇంధనం నింపుకొని వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించారు దాంతో లాహోర్ విమానాశ్రయంలో లైట్లు కూడా ఆఫ్ చేయించారు హైజాకర్లు. అక్కడినుంచి దుబాయి విమానాశ్రయానికి విమానం పయనమైంది. 27 మంది ప్రయాణికులను అక్కడ విడుదల చేసారు హైజాకర్లు. అదేసమయంలో దుబాయి విమానాశ్రయంలో హైజాకర్లపై చర్యలు తీసుకోవాలని యూఏఈని భారత్ కోరింది అందుకు యూఏఈ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ తర్వాత అక్కడినుంచి ఆఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు చేరుకుంది. చలిలో వారం పాటు విమానాశ్రయంలోనే ప్రయాణీకులు ఉన్నారు.

కమెండో ఆపరేషన్ కు సిద్దం..అడ్డుకున్న ఆఫ్ఘన్..
అక్కడే.. హైజాకర్లు పైన యాక్షన్ తీసుకునేందుకు భారత్ కమాండో సిద్ధమైంది. అందుకు అఫ్గానిస్తాన్ ను భారత్ అనుమతికోరింది. కానీ విదేశీ సైన్యం తమ భూభాగంలోకి వద్దని అఫ్గానిస్తాన్ వెల్లడించింది. ఆతర్వాత తాలిబన్లతో భారత్ చర్చలు జరిపింది. తమ బందీలుగా వారిని విడుదల చేయాలన్న కోరారు తాలిబన్లు. హైజాకర్ల డిమాండ్లకు అంగీకరించిన భారత్ మిలిటెంట్ల విడుదలకు అంగీకారం తెలిపింది. హైజాక్ ముగిసే వరకు భారత, ఆప్ఘన్ అధికారులు కాందహార్ విమానాశ్రయంలోనే ఉన్నారు.

వాజ్ పేయ్ ప్రభుత్వం పై ఒత్తిడి.. జశ్వంత్ సింగ్ రాయబారం..
రెండుసార్లు కాందహార్ వచ్చిన అప్పటి భారత విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ హైజాకర్లతో సంప్రదింపుల జరిపారు. మిలిటెంట్లు మౌలానా మసూద్ అజహర్, ముశ్తాక్ జర్గర్, అహ్మద్ ఉమర్ సయీద్ శేఖ్‌లను విడుదల చేసి భారత్‌లోని జైళ్ల నుంచి కాందహార్ విమానాశ్రయానికి తీసుకు వచ్చి అప్పగించారు . హైజాక్ ఉదంతం ముగిసే సమయంలో విమానం వద్దకి అంబులెన్స్ వచ్చి ఆగింది. ముసుగుల్లో ఉన్న ఐదుగురు హైజాకర్లు,మసూద్ అజహర్ సహా విడుదలైన మిలిటెంట్లు ఆ ఆంబులెన్స్ లో పారిపోయారు.

భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తిండి పోయే చేదు ఘటనగా..
వెళ్తూ వెళ్తూ.. రెండు గంటల్లోపు అఫ్గానిస్తాన్ దాటి వెళ్లిపోవాలని ఆదేశించారు. దాంతో మరో విమానం ఎక్కిన ప్రయాణీకులు క్షేమంగా ఇండియాకు చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధానిగా వాజ్ పేయ్ ఉన్నారు. ప్రయాణీకుల ప్రాణాలే ప్రధానమంటూ రాజకీయంగా ఒత్తిళ్లు వచ్చాయి. కొందరు ప్రయాణీకులను కోల్పోవాల్సి వచ్చింది. అది భారత్ ప్రభుత్వం పైన నాడు తీవ్రంగా ప్రభావం చూపింది. ఇప్పుడు తాలిబన్ల తాజాగా ఆఫ్ఘన్ ఆక్రమణతో ఈ ఉదంతాన్ని..అందునా ఈ రోజు దివంగత ప్రధాని వాజ్ పేయ్ వర్దంతి కావటంతో మరో సారి అందరూ గుర్తు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications