ప్రపంచ రికార్డ్: భారత్‌లో మే నెలలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు, అమెరికాతో పోటీగా..

న్యూఢిల్లీ: సెకండ్ వేవ్‌లో మనదేశంలో మే నెలలో అత్యధిక కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, ఒక్క నెలలో ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా మహమ్మారి నుంచి ప్రారంభమైన నాటి నుంచి ఒక నెలలో నమోదైన అత్యధిక కేసులు, మరణాలు ఈ మే నెలలోనే సంభవించడం గమనార్హం.

మే నెలలో కరోనా కేసుల ఉధృతి..

మే నెలలో కరోనా కేసుల ఉధృతి..

మే నెల మొదట్లో అత్యధిక కేసులు, మరణాలు సంభవించినప్పటికీ.. చివరి రోజుల్లో మాత్రం 2 లక్షలకు తక్కువగా కరోనా కేసులు, 3వేలకు దిగువనే మరణాలు సంభవించడం ఊరటనిచ్చే అంశం. మే నెల చివరలో.. ఏప్రిల్ 9 తర్వాత 1.5 లక్షల కంటే తక్కువ కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి.

ఒక్క మే నెలలో 90 లక్షలకుపైగా కరోనా కేసులు.. అమెరికా వెనక్కి

ఒక్క మే నెలలో 90 లక్షలకుపైగా కరోనా కేసులు.. అమెరికా వెనక్కి

మే నెలలో భారతదేశంలో నమొదైన మొత్తం కేసులు 90.3 లక్షలు. ప్రపంచంలోని దేశంలోనూ ఒక్క నెలలో ఇన్ని కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదు. అయితే, మే నెల రెండో వారం నుంచి కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ నెల కంటే 69.4 లక్షల కేసులు అధికంగా మే నెలలోనే సంభవించాయి. అమెరికాలో గత డిసెంబర్ నెలలో అత్యధికంగా 65.3 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.

అయితే, మిలియన్ జనాభాకు నమోదైన కేసులు అమెరికాలో 1,02,302 కేసులుంటే.. భారత్‌లో మాత్రం 20,144 కేసులు ఉన్నాయి. భారత్ కంటే ఐదు రేట్లు ఎక్కువగా అమెరికాలో కేసులున్నాయి.

మే ఒక్క నెలలోనే అత్యధిక మరణాలు

మే ఒక్క నెలలోనే అత్యధిక మరణాలు

ఇక మే నెలలోనే మనదేశంలో అత్యధిక మరణాలు సంభవించాయి. సుమారు 1.2 లక్షల కరోనా మరణాలు సంభవించాయి. మే నెలలో 1,19,000 మందికిపైగా కరోనాతో మరణించారు. ఇది ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే 2.5 రేట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఏప్రిల్ నెలలో 48.768 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, వాస్తవంగా కరోనా మరణాల సంఖ్య ఇంతకంటే ఎక్కువగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. స్మశానాల్లో కాలుతున్న మృతదేహాలకు, ప్రభుత్వాల చెబుతున్న లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంటుందని చెబుతున్నారు.

ఒక్క నెలలో అత్యధిక మరణాలు.. అమెరికా తర్వాత భారత్..

ఒక్క నెలలో అత్యధిక మరణాలు.. అమెరికా తర్వాత భారత్..

అమెరికా తర్వాత ఒక్క నెలలో అత్యధిక మరణాలు సంభవించిన భారత్ రికార్డుల్లోకెక్కింది. ఈ ఏడాద జనవరిలో అమెరికాలో 99,680 మంది కరోనాతో మరణించారు. గత డిసెంబర్ నెలలో అక్కడ 83,849 కరోనా మరణాలు సంభవించాయి. ఇక బ్రెజిల్‌లో ఈ ఏప్రిల్ నెలలో 82,401 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. భారత్, అమెరికా తర్వాత ఒక్క నెలలో అత్యధిక మరణాలు బ్రెజిల్‌లోనే సంభవించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+