ర్యాంక్ 4: అత్యుత్తమ రైళ్ల జాబితాలో 'మహారాజాస్ ఎక్స్‌ప్రెస్'
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యుత్తమ రైళ్ల జాబితాలో మన దేశానికి చెందిన 'మహారాజాస్ ఎక్స్‌ప్రెస్' గుర్తింపు సాధించింది. న్యూయార్క్‌కు చెందిన 'న్యూ వరల్డ్ వెల్త్' అనే సంస్ధ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ధనికులు ప్రధాన్యమిచ్చే రైళ్ల జాబితాలో 'మహారాజాస్ ఎక్స్‌ప్రెస్' కు నాల్గవ స్థానంలో నిలిచింది.
'ఈస్టర్న్, ఓరియంటల్ ఎక్స్‌ప్రెస్ (సింగపూర్, మలేషియా, థాయిలాండ్)' ప్రపంచంలోనే అత్యుత్తమ రైలుగా తాజా జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అత్యంత విలాసవంతమైన సౌకర్యాలను కలిగి ఉండే ఈ రైలు మనదేశ అద్భుత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే పలు పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది.
ఖరీదైన ఈ ప్యాకేజీల విలువ సుమారు రూ. 2 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన హోటళ్ల జాబితాలో సహారా గ్రూపునకు చెందిన 'ప్లాజా హోటల్ ఆఫ్ న్యూయార్క్' రెండో స్థానం సంపాదించింది.

లాస్‌వేగాస్‌లోని 'ది బెల్లాజియో' అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మాండరిన్ ఓటియంటల్ (లండన్), హోటల్ డు క్యాప్ ఈడెన్ రాక్ (అంటైబ్స్), రాఫల్స్ (సింగపూర్) విలాసవంతమైన హోటళ్ల జాబితాలో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నాయి.
ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 800 మంది అత్యంత ధనికుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా రైళ్లు, హోటళ్లకు సంబంధించి 'న్యూ వరల్డ్ హెల్త్' ఈ జాబితాను రూపొందిస్తూ ఉంటుంది. మరోవైపు ప్రపంచంలో అత్యత్తుమ రైళ్ల జాబితాలో ఆఫ్రికా ఖండానికి చెందిన రైళ్లే ఎక్కువగా ఉండటం విశేషం.












Click it and Unblock the Notifications