ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కొనసాగుతున్న పైలట్ల కొరత... మరో 130 విమానాలు రద్దు
బడ్జెట్ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో లో కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ విమానాలు నడిపేందుకు సరిపడా పైలట్లు లేకపోవడంతో మరో దేశవ్యాప్తంగా మరో 130 విమానాలను రద్దు చేసింది. ఇది ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఆపరేట్ చేస్తున్న మొత్త విమానాల్లో 10శాతం కావడం విశేషం. మరోవైపు దీనిపై విచారణకు ఆదేశించగా సమాధానం ఇచ్చేందుకు అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. గత శనివారం నుంచి విమానాలను రద్దు చేస్తూ వస్తోంది ఇండిగో విమానాయాన సంస్థ. చివరి నిమిషంలో రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు ప్రయాణికులు.
ఇక గురువారం రోజున దాదాపు 70 విమానాలను రద్దు చేసింది ఇండిగో ఎయిర్ లైన్స్. అప్పటికే కొన్ని విమానాలను రద్దు చేయగా... ఎయిర్ షో కారణంగా బెంగళూరు విమానం మూసివేశారన్న సాకు చూపింది యాజమాన్యం. ఇక మార్చి 31 నాటికి తిరిగి అన్ని సర్వీసులను పునఃప్రారంభిస్తామని ఆ యాజమాన్యం వెల్లడించింది. ఇక పైలట్లకు నోటీసులు పంపడం గురువారం నుంచి ప్రారంభమైంది. రద్దు అయిన విమానాల స్థానంలో మరి కొంతమంది ప్రయాణికులను ఇతర విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చినట్లు యాజమాన్యం తెలిపింది. బుధవారం రోజున 49 విమానాలను రద్దు చేసింది యాజమాన్యం.

ఇక ఫిబ్రవరి 13న పలు కారణాలు చూపుతూ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది యాజమాన్యం.తొలి రోజు 30 విమానాలు రద్దు చేస్తున్నట్లు చెప్పిన ఇండిగో సంస్థ... ఆ తర్వాత విమానాల రద్దు కొన్ని రోజుల వరకు కొనసాగుతుందని ఆ రోజే వెల్లడించింది. ఇదిలా ఉంటే రద్దయిన విమానాల్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ముందుగానే సమాచారం ఇస్తోంది సంస్థ. అంతేకాదు వీలైతే మరో ప్రత్యామ్నాయం ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications