విమానంలో ప్రయాణికురాలికి మురికి సీటు.. ఇండిగో సంస్థకు భారీ జరిమానా

సాధారణంగా విమానప్రయాణం అంటేనే లగ్జరీతో కూడుకున్న విషయం. ఇతర ప్రయాణ మార్గాల కంటే విమాన ప్రయాణానికే అధిక ఖర్చు ఉంటుంది. అందుకు తగ్గట్లు వైమానిక సంస్థలు ప్రయాణికుల భద్రత కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే ఇండిగో విమానంలో ప్రయాణికురాలికి మురికి సీటును కేటాయించింది ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు వినియోగదారుల ఫోరం సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ప్రయాణికురాలికి డర్టీ సీటు కేటాయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇండిగో విమానంలో ఇటీవల జరిగిన ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికురాలికి పరిశుభ్రంగా లేని, అసౌకర్యవంతమైన సీటును కేటాయించారు. దీంతో ఆమె దిల్లీలోని వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ జరిపిన వినియోగ దారుల ఫోరం సంస్థ.. ఇలా చేసినందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తంలో రూ.1 లక్షను ప్రయాణికురాలికి పరిహారంగా.. మిగిలిన రూ.50 వేలను న్యాయ పోరాట ఖర్చులకు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏడాది జనవరి 5 వ తేదీన పింకీ అనే మహిళ బాకు నుంచి దిల్లీకి ఇండిగో విమానంలో ప్రయాణించింది. అయితే ఆమెకు అపరిశుభ్రంగా, మరకలతో ఉన్న డర్టీ సీటును ఇచ్చారు. అది అసౌకర్యకంగా కూడా ఉండటం గమనార్హం. ఆమె దిల్లీ వచ్చేవరకు అందులోనే కూర్చున్నారు. ఆ తర్వాత దిల్లీలోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఆ సీట్లో కూర్చోవడం వల్ల తాను ఇబ్బందులు పడ్డానని తెలిపారు. అయితే విచారణ జరిపిన వినియోగ దారుల ఫోరం సంస్థ.. ఇలా చేసినందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థకు రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తంలో రూ.1 లక్షను ప్రయాణికురాలికి పరిహారంగా ప్రకటించింది. మిగిలిన రూ.50 వేలను న్యాయ పోరాట ఖర్చులకు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

IndiGo Fined Rs 1 5 Lakh for Dirty Seat on International Flight

ఇక ఇటీవలి కాలంలో దేశంలో విమాన ప్రమాదాలు, సాంకేతిక సమస్యలు అధికంగా జరుగుతున్నాయి. ఇటీవల గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఉత్తరాఖండ్ లో ఓ విమానం కూలి ఏడుగురు భక్తులు మరణించారు. అలాగే అనేక విమానాలు సాంకేతిక లోపం కారణంగా ఎక్కడపడితే అక్కడ ల్యాండింగ్ అవడం జరిగాయి. అలాగే మరికొన్ని ఆలస్యంగా ప్రయాణించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+