విమానంలో కొట్టుకున్నారు.. వీడియో వైరల్
ఇటీవల విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాలు అనేకం జరుగుతున్నాయి. విమానంలో కొంతమంది హల్ చల్ చేయడమూ విన్నాం. అలాంటి ఘటనే తాజాగా మరొకటి జరిగింది. ముంబై నుంచి కోల్ కతా బయల్దేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్ చల్ చేశాడు. తోటి ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డాడు. తనతో పాటు ప్రయాణిస్తున్న వ్యక్తి చెంప పగులగొట్టాడు. తనతో అసౌకర్యంగా భావించి కొట్టానని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
समाज पूरी तरह सड़ चूका है pic.twitter.com/l03axtIqSc
— Adil siddiqui (azmi) (@adilsiddiqui7) August 1, 2025
ఇటీవలి కాలంలో విమానంలో అనేక ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల భారత సంతతికి చెందిన 41 ఏళ్ల వ్యక్తి అభయ్ నాయక్ విమానంలో హల్ చల్ చేశాడు. లండన్ లోని లూటన్ నుంచి గ్లాస్కో బయల్దేరిన ఈజీ జెట్ ఫ్లైట్ విమానంలో అభయ్ నాయక్ ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాడు. ట్రంప్ ను చంపేస్తా.. అల్లా హు అక్బర్ అని నినాదాలు చేయడంతో విమానంలోని వాళ్లంతా భయపడిపోయారు. అంతేకాక తన దగ్గర బాంబు ఉందని ఆత్మాహుతి దాడి చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

తాజాగా ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు నానా హైరానా చేశాడు. ముంబై నుంచి కోల్ కతా వెళ్తున్న విమానంలో తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. తనకు అసౌకర్యం కలిగిస్తున్నాడంటూ తోటి వ్యక్తి చెంప పగులగొట్టాడు. దీంతో ప్రయాణికులు అంతా భయపడ్డారు. దీంతో విమానంలో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. అకారణంగా ఆ వ్యక్తిని కొట్టడంపై తోటి ప్రయాణికులు నిందితుడ్ని నిలదీశారు. ఎందుకు కొట్టావ్ అని అడగ్గా.. తనకు సమస్య ఎదురైందని అందుకే కొట్టినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ప్రతి ఒక్కరికీ సమస్యలు ఎదురవుతాయని.. దానికే చేయి చేసుకుంటారా..? అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం కోల్ కతా ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవ్వగానే నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications