ఇండిగో విమానంలో మంటలు: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ (వీడియో)
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో మంటలు, నిప్పురవ్వలు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలోనే నిలిపివేశారు.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్ లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమాన ఘటనకు సంబంధించిన వీడియోను ప్రియాంక కుమార్ అనే మహిళ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

అంతకుముందు, గురువారం ఢిల్లీకి బయలుదేరిన అకాసా ఎయిర్ ఫ్లైట్ ఎక్కే సమయంలో పక్షి ఢీకొట్టింది. దీని కారణంగా విమానం రాడోమ్ దెబ్బతింది.
Indigo 6E 2131
— Priyanka Kumar (@PriyankaaKumarr) October 28, 2022
Scary experience on Delhi runway!
This was supposed to be a take off video but this happened. #indigo pic.twitter.com/6kcKCSVLOh
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో.. "శుక్రవారం రాత్రి అకాస B-737-8 (మాక్స్) విమానం VT-YAF ఆపరేటింగ్ ఫ్లైట్ QP-1333 (అహ్మదాబాద్-ఢిల్లీ)టేకాఫ్ అయ్యే సమయంలో పక్షి దాడిని ఎదుర్కొంది. 1900 అడుగులు దాటింది. ఢిల్లీలో ల్యాండింగ్ తర్వాత, రాడోమ్ దెబ్బతినడం గమనించారు.
అంతకుముందు అక్టోబర్ 14న బెంగుళూరుకు వెళ్లే మరో అకాసా ఎయిర్ విమానాన్ని పక్షి ఢీకొనడంతో ముంబైకి మళ్లించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications