Chennai: చెన్నై ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ముప్పు.. వైరల్ అయిన వీడియో..!

ఫెయింజల్ తుపానుతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలతో అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చెన్నైలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తమిళనాడులోని ఉత్తర జిల్లాలు, పుదుచ్చేరిలోని డెల్టా జిల్లాల్లో అతి భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం ఆదివారం తెల్లవారుజాము 4 గంటల వరకు మూసివేశారు. అయితే శనివారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది.

ఇండిగో ఎయిర్ లైన్స్ చెందిన విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సరిగా కనిపించిన పరిస్థితులో చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. అయితే బలమైన గాలులు విస్తుండడంతో రన్ పై విమానం దాదాపు ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం అటు ఇటుగా వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని టేకాఫ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ విమానం ఎక్కడికి వెళ్లింది.

IndiGo flight narrowly avoids major accident at Chennai airport

ఎక్కడ నుంచి ఎక్కడి వెళ్తుందో తెలియరాలేదు. కానీ ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఇండిగో ఎయిర్ లైన్స్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే అదే ఎయిర్ పోర్టులో మరో ఫ్లైట్ బలమైన గాలులను తట్టుకుని సురక్షితంగా ల్యాండ్ అయింది. తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదివారం వాతావరణ అనుకూలించడంతో చెన్నై ఎయిర్ పోర్టు నుంచి విమాన సర్వీసులు పునఃప్రారంభం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+