ఇక ప్రతీ విమానంలో రెండు దోమల బ్యాట్లు: ఇండిగో నిర్ణయం..
న్యూఢిల్లీ: విమానాల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టింది ఇండిగో ఎయిర్‌లైన్. ఇందులో భాగంగా విమానాల్లో దోమల బ్యాట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు విమానాల్లో ఎలక్ట్రికల్ బ్యాట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
విమానంలో దోమల బెడదపై ఇటీవల ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేసిన ఎఫెక్ట్ తో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది ఇండిగో ఎయిర్ లైన్స్. దోమలున్నాయని ఫిర్యాదు చేసినందుకు ఆ ప్రయాణికుడిని దించేయడంతో ఇండిగో వివాదంలోనూ ఇరుక్కుంది.

కాగా, దోమల నివారణ చర్యల్లో భాగంగా ఒక్కో విమానంలో 2 ఎలక్ట్రికల్ బ్యాట్లను ఉంచనున్నట్టు సమాచారం. నిర్ణీత సమయం ప్రకారం కేబిన్ సిబ్బంది వీటిని ఉపయోగిస్తారని తెలుస్తోంది. అయితే విమానంలో ఇంధనాన్ని నింపేటప్పుడు మాత్రం వీటిని ఉపయోగించబోరని ఓ అధికారి తెలిపారు.
దోమల బెడదపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం, ఆ కారణంగా విమానాలు ఆలస్యమైన ఘటనలు కూడా ఉండటంతో ఈ చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇండిగో అధికారి ప్రతినిధి దీనిపై స్పందించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎలక్ట్రిక్ బ్యాట్లను ఉపయోగిస్తామని అన్నారు. కాగా, కోల్‌కతా, లక్నో, వారణాసి లాంటి ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications