రూ.899కే విమాన టికెట్లు: ఇండిగో దీపావళి ఆఫర్, కానీ, షరతులు వర్తిస్తాయి

న్యూఢిల్లీ: దీపావళి పండగను పురస్కరించుకుని దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి భారీ ఆఫర్లను ప్రకటించింది. దీపావళి స్పెషల్ సేల్ పేరుతో ప్రారంభ ధర రూ.899 టికెట్ అందిస్తున్నట్లు వెల్లడించింది.

మూడు రోజులపాటు..

మూడు రోజులపాటు..

మూడు రోజులపాటు అందించే ఈ ఆఫర్ కింద 10లక్షల సీట్లను కేటాయించినట్లు ఇండిగో తెలిపింది. అక్టోబర్ 24-26 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ప్రారంభ ధర రూ.899కే టికెట్. నవంబర్ 8, 2018, ఏప్రిల్ 15, 2019 వరకు ఈ ఆఫర్ కింద ప్రయాణాలు చేయొచ్చని పేర్కొంది.

64మార్గాల్లోనే..

64మార్గాల్లోనే..

మూడురోజులపాటు ఫెస్టివల్ సేల్ కింద ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరకే టికెట్లు అందిస్తున్నామని ఇండిగో తెలిపింది. ఇండిగో ప్రయాణించే 64 గమ్యస్థానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

నాన్ స్టాప్ మార్గాల్లోనే..

నాన్ స్టాప్ మార్గాల్లోనే..

తమ కుటుంబసభ్యులను, స్నేహితులను కలుసుకుని వారితో దీపావళి పండగను జరుపుకునేందుకే ఈ ఫెస్టివల్ ఆఫర్ తీసుకొచ్చినట్లు ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ తెలిపారు. ఎయిర్‌పోర్టు ఛార్జీలు, ప్రభుత్వ పన్నుల మీద ఎటువంటి రాయితీ ఉండబోదని వెల్లడించారు. దేశీయ, విదేశీ మార్గాల్లో ప్రయాణించే నాన్ స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

నగదు తిరిగి ఇవ్వడం జరగదు

నగదు తిరిగి ఇవ్వడం జరగదు

ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన టికెట్లు రద్దు చేసుకుంటే నగదు తిరిగి ఇవ్వడం జరగదని సదరు అధికారి తెలిపారు. ఇండిగో వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. తాము అందిస్తున్న ఈ ఆఫర్ విమానయాన సంస్థల మధ్య పోటీని పెంచుతుందని చెప్పారు. కాగా, ఇండిగో ఆఫర్ ప్రకటించింది గానీ.. తక్కువ ధరకు టికెట్లు అందుబాటులో ఉంచలేదని ఇండిగో వెబ్‌సైట్ సందర్శించిన కస్టమర్లు వాపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+