విమాన టిక్కెట్లు భారీగా తగ్గింపు, ఇండిగో బంపర్ ఆఫర్

దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ మరోసారి విమాన టిక్కెట్లపై బంపర్ ఆపర్‌ను ప్రకటించింది. 11వ, వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది.

న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ మరోసారి విమాన టిక్కెట్లపై బంపర్ ఆపర్‌ను ప్రకటించింది. 11వ, వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది.

రూ. 1111 నుండి ప్రారంభమయ్యే టిక్కెట్లను విక్రయించనున్నట్టు ఇండిగో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కొన్ని ప్రాంతాలకే వర్తింపచేయనున్నారు.

 IndiGo offers tickets starting Rs 1111 to mark 11th anniversary

ఈ ఆఫర్‌లో ఆగష్టు రెండవ తేది నుండి ఆగష్టు 6వ, తేదివరకు టిక్కెట్ల బుకింగ్ అందుబాటులో ఉండనున్నాయి. ఇలా బుక్ చేసుకొన్న టిక్కెట్ల ద్వారా ఆగష్టు 21 నుండి వచ్చే ఏడాది మార్చి 24వరకు ప్రయాణించే వెసులుబాటు కల్పించింది.

దేశంలో మొత్తం 45 ప్రాంతాలకు ఈ ఆఫర్‌ను వర్తింపజేసింది. అంతేకాదు మొబీక్విక్ వ్యాలెట్ ద్వారా టిక్కెట్టు బుక్ చేసుకొన్నట్టైతే మరో 11 శాతం ఆఫర్ వస్తోంది.

ఈ ఆఫర్ కింద www.goindigo.in లేదా ఇండిగో మొబైల్ యాప్‌తో బుక్ చేసుకొంటే 11 శాతం సూర్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.

సుమారు రూ.600 రూపాయా దాకా ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. అన్ని బుకింగ్ ఛానెళ్ళలోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటాయి. అయితే నాన్‌స్టాఫ్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తోందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.

ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్‌కతా లాంటి మెట్రో నగరాలతో పాటు భువనేశ్వర్ , చండీగఢ్, పూణె, అహ్మదాబాద్‌లోని ఈ ఇక్కడ ఇండిగో విమానాల జాబితాలో ఉన్నాయి. షార్జా, మస్కట్, దుబాయ్, దోహ, ఫోర్ట్‌బ్లెయిర్ వంంటి అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఇండిగో తాజా పథకం కూడ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+