ఇందిరా గాంధీ చేయి ఇలా పెట్టుకున్నారు: మోడీ వ్యంగ్యం

ఇక్కడికి వచ్చినప్పుడు ఇందిరా గాంధీ ముక్కుకు చేయి అడ్డం పెట్టుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

అహ్మదాబాద్: ఇక్కడికి వచ్చినప్పుడు ఇందిరా గాంధీ ముక్కుకు చేయి అడ్డం పెట్టుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇందిరా గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా చేయి పెట్టుకున్నారని ఆయన ముక్కుకు చేయి అడ్డం పెట్టుకుని చూపించారు.

గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచార సభలో ఆయన బుధవారంనాడు మాట్లాడారు. కీలకమైన మోర్బీలో ఆయన ప్రసంగించారు. హెలికాప్టర్ ద్వారా వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది.

Indira Gandhi Held Her Nose Here, Says PM Modi In Gujarat's Morbi

మంచి రోజుల్లోనూ చెడు రోజుల్లోనూ తాము మోర్బీకి బాసటగా నిలిచామని ఆయన అన్నారు. ఈ మాట కాంగ్రెసు చెప్పలేదని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 13 ఏళ్ల కాలంలో గుజరాత్ అభివృద్ధి నమూనాలో మోర్పీకి ప్రత్యేకత ఉందని ఆయన అన్నారు.

తాను అధికారంలోకి వచ్చినప్పుడు సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు నీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయని, కాంగ్రెసు అభివృద్ధి పేరుతో చేతి పంపులు ఇస్తే తాము నర్మదా నది నుంచి భారీ పైపులైన్లు వేశామని, భారీ ప్రాజెక్టులు చేపట్టామని ఆయన చెప్పారు.

ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీ గుజరాత్‌కు వ్యతిరేకమని అన్నారు. ఇందిరా బెన్ మోర్బీకి వచ్చినప్పుడు దుర్వాసనను భరించలేక ముక్కుకు దస్తీని అడ్డం పెట్టుకున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+