ఎమర్జెన్సీ గురించి ఇందిరకు అవగాహన లేదు: ప్రణబ్ ముఖర్జీ (ఫోటోలు)
న్యూఢిల్లీ: 'ద డ్రమాటిక్ డికేడ్: ద ఇందిరా గాంధీ ఇయర్స్' పేరుతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం విడుదలైంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ప్రణబ్ వెల్లడించిన విషయాలు కలకలం రేపుతున్నాయి.
1975లో అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలపై మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అవగాహన లేదని పేర్కొన్నారు. కేవలం పశ్చిమబెంగాల్ మాజీ సీఎం సిద్ధార్థ్ శంకరే సూచన మేరకే ఎమర్జెన్సీని విధించినట్టు చెప్పారు.
ఎమర్జెన్సీ విషయంలో ఆయనే ముఖ్య భూమిక పోషించారని వెల్లడించారు. దానిపై తనకు అవగాహనలేదని ఇందిరాగాంధీ తరువాత తనకు చెప్పారన్నారు. ప్రధాని ఇందిరాగాంధీ సలహా మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మాద్ రాజ్యాంగంలోని 352 ఆర్టికల్‌ను ఉపయోగిస్తూ దేశంలో ఎమర్జెన్సీ విధించారు.
ఎమర్జెన్సీ ప్రకటన వెలువడిన వెంటనే దేశంలో పలువురు ముఖ్య ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు. అరెస్టులను తప్పించుకోవడానికి చాలా మంది రాజకీయ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమర్జెన్సీ కారణంగా ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించవలసి వచ్చిందని అన్నారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన 79వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని మోడీ కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ జీవించాలని కోరుకుంటున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు.
కాగా, ప్రణబ్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రణబ్ ముఖర్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన 79వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు పూల గుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రణబ్ ముఖర్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన 79వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రణబ్ ముఖర్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన 79వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రణబ్ ముఖర్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన 79వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications