ఎగబడ్డారు: భార్యను ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టాడు

ఇండోర్: ఇటీవల కాలంలో చాలా మంది సోషల్ మీడియా దిగ్గజ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ప్రేమలో పడుతున్నారు. ఫేస్‌బుక్‌లో ప్రేమలో పడటం ఏంటీ అని అనుకుంటున్నారా? అదేనండీ ఫేస్‌బుక్‌ ద్వారా కొత్త వారితో పరిచయాలు పెంచుకోవడం, అదే విధంగా తమ చిన్ననాటి స్నేహితులను కలుసుకునేందుకు గాను ఫేస్‌బుక్‌‌ను విరివిగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఫేస్‌బుక్‌ వల్ల ఎంతో మందికి ఎన్నో రకాలుగా లబ్ధి పొందితే, మరికొందరు ఈ ఫేస్‌బుక్‌ బారిన పడి కష్టాలను కూడా కొని తెచ్చుకున్నారు. అయితే తాజాగా డబ్బు కోసం ఓ ప్రబుద్ధుడు ఈ ఫేస్‌బుక్‌‌ను మాధ్యమంగా ఎంచుకున్నాడు. డబ్బు కోసం తన భార్యను ఏకంగా ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టాడు.

సంచనలం సృష్టించిన ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టణంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలాలి ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలోని శభమ్‌ నగర్‌లో నివాసం ఉంటున్న దిలీప్‌ అనే వ్యక్తి తన భార్యను ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టాడు.

Indore: Husband gives advertisement to sell wife on Facebook

తన భార్య ఫోటోతో పాటు లక్ష రూపాయల ప్రైస్‌ టాగ్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఆసక్తి ఉన్న బయ్యర్లు పైనున్న ఈ నెంబర్‌ను సంప్రదించాలంటూ ఫోన్ నెంబర్‌ను కూడా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఈ ప్రకటనను చూసిన కొంతమంది దిలీప్‌ను సంప్రదించారు.

ఈ క్రమంలో తన భార్యతో పాటు తన కుమార్తె ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. తాను బ్యాంకుల వద్ద నుంచి రుణం తీసుకున్నాయని, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలనే ఉద్దేశ్యంతో తన భార్యను అమ్మకానికి పెట్టానని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరకు పోలీసులకు చేరింది. దీంతో దిలీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగేళ్ల కిత్రం వివాహం జరిగిన దిలీప్‌కు మూడేళ్ల కుమార్తె ఉంది. దిలిప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫేస్‌బుక్‌లో అతడు పెట్టిన ప్రకటనను తీసేయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+