మరో మహాభారతం: జూదంలో భార్యను ఫణంగా పెట్టిన భర్త, ఆపై దుశ్శాసన పర్వం
జూదంలో ఓడిపోయిన భర్త తనను ఇద్దరు వ్యక్తులకు అప్పగించటంతో వారు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.
ఇండోర్: జూదంలో ఓడిపోయిన భర్త తనను ఇద్దరు వ్యక్తులకు అప్పగించటంతో వారు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.
జూదానికి బానిసైన ఓ వ్యక్తి ఓడిపోతే తన భార్యను ఇస్తానని బెట్ కట్టాడు. ఆటలో ఓటమి పాలై అందుకు బదులుగా తన భార్యను గెలిచిన ఇద్దరికి అప్పగించాడు. దీంతో ఆ ఇద్దరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

దీనిపై బాధితురాలు మంగళవారం ఇండోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆమె భర్తతోపాటు వేధింపులకు పాల్పడిన ఇద్దరిని స్టేషన్ కు పిలిపించి విచారించారు.
ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఇండోర్ మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జ్ జ్యోతి శర్మ వెల్లడించారు. బాధితురాలి భర్తతో పాటు మిగతా ఇద్దరు కూడా ఆమెను వేధిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని వివరించారు.












Click it and Unblock the Notifications