ఒబామా పర్యటన: సరిహద్దు వెంబడి తిష్టవేసిన 9ఉగ్రవాద గ్రూపులు

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన 8 నుంచి 9 ఉగ్రవాద గ్రూపులు జమ్మూకాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో లాంచ్ ప్యాడ్లు, అణ్వాయుధాలతో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో దాడులకు తెగబడి అలజడి సృష్టించేందుకు ఉగ్రమూకలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్ సైన్యాధికారుల సహాయ సహకారాలతో 40 నుంచి 45మంది ఉగ్రవాదులు భారత సరిహద్దులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఒబామా భారత్ వస్తున్న నేపథ్యంతో భారీ ఎత్తున దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని తెలిపాయి.

Infiltration bid by 9 terror groups before Obama trip

జమ్మూ-కాశ్మీరులోని సాంబా సెక్టార్‌లో భారత్-పాక్ బలగాలకు మధ్య ఇటీవల తరచుగా భీకర కాల్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. సాంబా సెక్టార్‌లో పాక్ కాల్పులకు తెగబడగా.. భారత బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాక్ కాల్పుల్లో భారత్‌కు చెందిన నలుగురు గాయపడ్డారు.

శుక్రవారం రాత్రి ప్రారంభమైన కాల్పులు శనివారం తెల్లవారుజాము వరకూ కొనసాగాయి. పాక్ సైన్యం భారత భూగంలోని బిఎస్ఎఫ్ స్థావరాలే లక్ష్యంగా కాల్పులు జరిపిందని ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+