13 లక్షల మంది ఫాలోవర్లు.. ఫైనాన్స్ ప్రపంచంలో మంచి గుర్తింపు.. కానీ చివరకు..

పుదుచ్చేరికి చెందిన ప్రముఖ ఫైనాన్స్ ఇన్‌ ఫ్లుయెన్సర్‌ 'ఫైనాన్స్ విత్ హరీష్' (27) మంగళవారం చెన్నై ముత్తుకాడలోని అద్దె విల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు. సోషల్ మీడియాలో 13 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న హరీష్.. ఓ టెక్ సీఈఓ తనను వేధిస్తున్నాడంటూ చనిపోయే ముందు పోస్ట్ చేశారు. ఈ వీడియోలో టెక్‌ సీఈఓ జేసన్ శామ్యూల్ వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్లు ఆరోపించారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి రూ. 3 కోట్లు డిమాండ్ చేయడంతో పాటు, తన సోషల్ మీడియా ఖాతాలను శామ్యూల్ తొలగించారని ఆయన తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక కొన్నిరోజుల క్రితం జేసన్ ఓ వీడియో రిలీజ్ చేస్తూ అందులో హరీశ్‌ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌ మెంట్ అడ్వైజర్ కాకుండానే హరీశ్ ఫైనాన్షియల్ సలహాలు ఇస్తున్నాడని ఆ వీడియోలో పేర్కొన్నారు జేసన్. అంతేకాదు ఏఎంఎఫ్ ఐ లైసెన్స్ లేకపోయినా తన వద్ద ఉందంటూ హరీశ్ తప్పుదోవ పట్టిస్తున్నాడని జేసన్ ఆరోపించారు. జేసన్ చేసిన ఈ ఆరోపణల నేపథ్యంలోనే.. హరీశ్ ఇన్‌ స్టాగ్రామ్ హ్యాండిల్‌ ను మెటా సంస్థ బ్లాక్ చేసింది. అదే సమయంలో జేసన్ తనని బెదిరించి, డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడని ఓ వీడియో రిలీజ్ చేశారు హరీశ్.

influencer death Shocking Online harassment leads suicide of influencer with 1 3 million followers

ఈ మేరకు తనపై తప్పుడు వీడియోలు పెట్టి, సోషల్ మీడియా ఖాతాల్ని బ్లాక్ చేయిస్తానని వేధించాడని వీడియోలో పేర్కొని హరీశ్ ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో జేసన్ వేధింపుల వల్ల తన కుమారుడు సూసైడ్ చేసుకున్నాడని హరీశ్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ తాను ఎవరినీ వేధించలేదని.. హరీశ్ తప్పులను మాత్రమే ఎత్తి చూపానని ఎక్స్ ద్వారా జేసన్ శామ్యూల్ వివరణ ఇచ్చారు. ఇక తమిళనాడులో పెను దుమారం రేపిన ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+