ఇన్ఫీ షేర్ ఢమాల్: భారీ పతనంతో టాప్-10 నుంచి అవుట్..

సంస్థపై అమెరికా న్యాయవాద సంస్థలు విచారణ చేపట్టే అవకాశం వస్తుండంటంతో.. సోమవారం కూడా ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపలేదని తెలుస్తోంది.

ముంబై: సిక్కా రాజీనామా ఎఫెక్ట్ ఇన్ఫోసిస్‌పై ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టాక్ మార్కెట్లలో లిస్టయిన టాప్-10కంపెనీల నుంచి ఇన్ఫోసిస్ నిష్క్రమించిందంటే ఆ సంస్థ షేర్ల పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంస్థపై అమెరికా న్యాయవాద సంస్థలు విచారణ చేపట్టే అవకాశం వస్తుండంటంతో.. సోమవారం కూడా ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపలేదని తెలుస్తోంది.

ఈ దెబ్బతో బైక్ బ్యాక్ ఆఫర్ కు ఇన్వెస్టర్ల నుంచి ఆశించినంత ఆదరణ లభించకపోగా.. సోమవారం అత్యధికంగా పతనమైన షేరుగా ఇన్ఫీ నష్టపోయింది. అదే సమయంలో దీనికి తోడు ఉత్తరకొరియా- అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు అత్యధికంగా నష్టపోగా.. రెండు వారాల అత్యల్పస్థాయిలో సోమవారం మార్కెట్‌ ముగిసింది.

Infosys' 2nd day correction drags Sensex 266 pts, Nifty below 9800; Midcap dips 1.5%

ఇక నిఫ్టీ 83 పాయింట్లు పతనమై 9,754 వద్ద ముగియగా.. సెన్సెక్స్‌ 265 పాయింట్లు పతనమై 31,253 వద్ద స్థిరపడింది. టీసీఎస్‌, ఐషర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం షేర్లు లాభపడగా.. ఇన్ఫోసిస్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టపోయాయి. యూరప్ దేశాల మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుంటే.. ఆసియా మార్కెట్లలో హ్యాంగ్‌ సంగ్‌, తైవాన్‌, షాంగై మార్కెట్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+