శుభవార్త: ఉద్యోగులకు ఇన్పోసిస్ సంక్రాంతి కానుక, 95% వేరియబుల్ పే
Recommended Video

న్యూఢిల్లీ: ఇన్పోసిస్ సంక్రాంతి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను ఉద్యోగులకు ప్రకటించింది. సుమారు 95 శాతం వేరియబుల్ పే ను ఇన్పోసిస్ సంక్రాంతి సందర్భంగా ప్రకటించింది. గత 9 త్రైమాసికాల కంటే ఇదే ఎక్కువ కావడం గమనార్హం.
ఇన్పోసిస్‌లో ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న పరిణామాలు ఆ కంపెనీపై ప్రభావం చూపాయి. ఇన్పోసిస్ కంపెనీ బాధ్యతలను నందన్ నిలేకని చేపట్టిన తర్వాత కంపెనీలో పరిస్థితులు యధాస్థితికి చేరుకొన్నాయని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే కంపెనీ సీఈఓగా సలీల్ నియామకమయ్యారు. అయితే అదే సందర్భంగా కంపెనీలో కీలకంగా ఉన్న రాజశేఖర మూర్తి ఇటీవలనే రాజీనామా చేయడం కొంత కలవరపాటుకు గురిచేసింది. అయినా కానీ, కంపెనీ తన ఉద్యోగులకు సుమారు 90 శాతం వేరియబుల్ పే ను ప్రకటించింది.

ఇన్పోసిస్ ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్
ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు సంక్రాంతి పండుగ సర్‌ప్రైజ్ అందించింది. డిసెంబర్ త్రైమాసికానికి గాను, తన ఉద్యోగులకు 95 శాతం వేరియబుల్ పే ను ప్రకటించింది. గత తొమ్మిది త్రైమాసికాల్లో చెల్లించిన వేరియబుల్ పేలతో పోల్చుకుంటే ఇదే అత్యధికం.కొత్త సీఈవోగా సలీల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమౌతోంది.

డిసెంబర్ త్రైమాసికంలో 38 శాతం వృద్ది
ఇన్ఫోసిస్ తన డిసెంబరు త్రైమాసిక ఫలితాలను ఇటీవల వెల్లడించింది. ఆ త్రైమాసికంలో సంస్థ నికర లాభంలో 38శాతం వృద్ధి సాధించింది. డిసెంబరు త్రైమాసికంలో సంస్థ గరిష్ఠంగా 12,622 స్థూల నియామకాలు చేపట్టింది. సెప్టెంబరు త్రైమాసికంలో ఈ నియామకాల సంఖ్య 10,514 మాత్రమే.

ఈ ఏడాదిలో అత్యధిక నియామకాలు
గత ఏడాది కంటే ఈ ఏడాది ఇదే త్రైమాసికంలో కేవలం 9,120 నియామకాలు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది చేపట్టిన నియామకాలు చాలా అత్యధికమని మార్కెట్ నిపుణులు తెలిపారు.

ఇబ్బందులు తప్పినట్టేనా
ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఇవ్వడంతో కంపెనీలో సంక్షోభం ముగిసినట్టేనా అని చర్చ కూడ సాగుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇచ్చిన గిప్ట్ అత్యధికంగా ఉద్యోగులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ శుభ సూచికాలని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications