Infosys: నారాయణమూర్తి ఐడియానే పట్టించుకోని ఉద్యోగులు ! ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం..!
భారత్ లో అత్యధిక వేతనాలు అందుకుంటున్న ఐటీ ఉద్యోగులపై ఒత్తిడి కూడా ఆ స్ధాయిలోనే ఉంటోంది. దీంతో వారానికి 70 పని గంటలకు పరిమితం చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వారానికి 70 పని గంటలు మాత్రమే ఉండాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రోజుకు 9.15 గంటల చొప్పున వారానికి 70 గంటలు మాత్రమే పని చేయాలనేది ఆయన ఆలోచన. అయితే ఈ ఆలోచనను ఆయన సొంత కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులే అమలు చేయడం లేదట.
దీంతో ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఇకపై పని గంటలు దాటినా ఎక్కువ సమయం డ్యూటీలో ఉంటే వార్నింగ్ ఈ మెయిల్స్ పంపాలని మానవ వనరుల విభాగం (హెచ్ఆర్) నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగులందరికీ ఓ ఈ మెయిల్ పంపింది. వారానికి 70 పని గంటలు మాత్రమే ఉండాలని, వారాంతంలో రెండు రోజులు సెలవులు ఇవ్వాలన్న నారాయణ మూర్తి ఆలోచన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నారాయణమూర్తి ఆలోచనకు భిన్నంగా ఎక్కువ గంటలు పనిచేస్తున్న ఉద్యోగులకు ఆటోమేటిగ్గా రోజుకు 9.15 గంటలు దాటితే వార్నింగ్ మెయిల్ పంపేలా ఓ వ్యవస్ధను ఏర్పాటు చేశారు.

వాస్తవానికి ఇన్ఫోసిస్ క్యాంపస్ లలో కాకుండా ఇంటి వద్ద నుంచే రిమోట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇలా నిర్ణీత సమయం 9.15 గంటల కంటే ఎక్కువగా పనిచేస్తున్నట్లు హెచ్ఆర్ వర్గాలు గుర్తించాయి. వీరికి నెలవారీ పని గంటల లెక్క ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్యాల్ని అందుకునేందుకు ఇలా కొన్ని రోజులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ వారికి ఇలా వార్నింగ్ మెయిల్స్ పంపి అలర్ట్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రభావం 3.23 లక్షల మంది ఉద్యోగులపై ఉంటుందని అంచనా.
పని పట్ల మీ నిబద్ధతను ప్రశంసిస్తున్నామని, అయితే వృత్తి జీవితానికీ, వ్యక్తిగత జీవితానికీ మధ్య ఉండాల్సిన సమతుల్యం దెబ్బతినకుండా ఉంటే దీర్ఘకాలికంగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఆర్ ఉద్యోగులకు పంపుతున్న మెయిల్స్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. భారతీయ ఐటీ రంగంలో ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications