ప్రేమించి పెళ్ళిచేసుకొన్నారని నగ్నంగా ఊరేగించారు
భోపాల్ :సమాజం రోజులు మారుతున్నాయి. అనేక కొత్త కొత్త విషయాలను మానవుడు కనుగొంటున్నాడు , కాని సాటి మనిషి అనే మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. జాలి, దయ, కరుణ చూపేందుకు కూడ వెనుకాడుతున్నారు. ప్రేమించుకొన్న పాపానికి ప్రేమికుల జంటను నగ్నంగా ఊరేగించారు. సభ్యసమాజం సిగ్గుపడే ఈ సంఘటన మద్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
మద్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్తాం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది.మానవత్వం మంటగలిపేలా ప్రేమజంట ఇరు కుటుంబాలు వ్యవహారించారు..రత్తాం జిల్లా మెగలిఖేడాలో పదిహేను రోజుల క్రితం ఓ ప్రేమ జంట వివాహం చేసుకొంది. ఈ వివాహన్ని రెండు వైపులా కుటుంబాలు మూర్ఖంగా వ్యవహారించారు.

ఈ ప్రేమను రెండు కుటుంబాలు వ్యతిరేకించారు.ఇరు కుటుంబాల పెద్దలు ప్రేమ జంటను బంధించారు. ఆ ప్రేమ జంటను చిత్రహింసలు పెట్టారు.పారిపోకుండా వారిని వేర్వేరుగా తాళ్ళతో కట్టేశారు.అంతటితో వారిలో కసి తీరలేదు.ప్రేమ జంటను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు.
ప్రేమ జంటను చిత్రహింసలు పెట్టి గ్రామంలో నగ్నంగా ఊరేగించిన ఘటనను కొందరు చిత్రీకరించి సామాజిక మాద్యమంలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.ఈ వీడియో ఆదారంగా పోలీసులు గ్రామానికి చేరుకొని యువతిని రక్షించారు. అయితే యువకుడి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications