అమానవీయం...కుక్కపిల్లను కాలితో తొక్కి..దారుణంగా చంపాడు..
మానవత్వం మరిచిన కొందరు మనుషులు ప్రస్తుత సమాజంలో మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వైపు తోటి వ్యక్తులపైనే దాడులకూ, హత్యలకూ కొందరు తెగబడుతుంటే.. మరికొందరేమో అసలు మనిషి అనే పదానికే అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మనుషులపై ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో..మూగజీవాలను సైతం అదే విధంగా హింసిస్తున్నారు. వాటి హక్కులకూ భంగం కలిగిస్తున్నారు. ప్రతి రోజు మనం రోడ్డు పక్కనో, ఏ టీ షాపు పక్కనో, కుక్క పిల్లలను చూస్తూ ఉంటాం. ఎవరో వచ్చి ఏదో తినడానికి పడేస్తారని అవి ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటాయి. కానీ వాటిని పట్టించుకునే నాథుడే ఉండరు సరికదా. వాటిపైనే క్రూరత్వం ప్రదర్శిస్తుంటారు కొందరు. అలాంటి సంఘటనే ఇప్పడు మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వైరల్ అవుతోన్న వీడియో : మధ్యప్రదేశ్ గునాలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కుక్కపిల్లను అత్యంత దారుణంగా కొట్టి మరీ చంపేశాడు. గునాలోని ఓ షాపు ముందు కూర్చున్న ఓ వ్యక్తి దగ్గరికి రెండు కుక్కపిల్లలు వచ్చాయి. అయితే, ఆ కుక్కపిల్లలపై అతడు ప్రవర్తించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ రెండింటీలో ఒక కుక్కపిల్ల అతని దగ్గరికి వెళ్లింది. దాంతో అతను పట్టరాని కోపంతో ఆ కుక్కపిల్లను మొదట చేయితీ నెట్టాడు. అయినా, అది దగ్గరికి రావడంతో ఆ పప్పీనీ నేలకేసీ బాదాడు. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి ఆ కుక్కపిల్లను తన కాలితో తొక్కి.. అత్యంత దారుణంగా దాన్ని చంపేశాడు. అయితే, ఈ వీడియో కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
స్పందించిన సీఎం : ఈ వీడియో చూసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఈ ఘటనపై స్పందించారు. ఇది ఒక అనాగరికి చర్య అని.. ఈ ఘోరానికి పాల్పడిన వ్యక్తిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీఎం సోషల్‌మీడియాలోని తన ఖాతాలో ట్వీట్ చేయడం జరిగింది. ఈ వీడియోను చూసిన చాలామంది నెటిజన్లు ఆ వ్యక్తిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరికొందరేమో ఛీ..ఛీ.. వీడు మనిషేనా? అంటూ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications