ఎల్జేపీ అధినేత, కేంద్రమంత్రి పశుపతికి చేదు అనుభవం: సిరాతో మహిళ దాడి

పాట్నా: లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడు, కేంద్రమంత్రి పశుపతి పరాస్‌కు బీహార్ రాష్ట్రంలోని తన నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. కేంద్రమంత్రివర్గంలో చోటో దక్కించుకున్న తర్వాత తొలిసారి తన నియోజకవర్గం హజీపూర్‌లో పర్యటించారు పశుపతి పరాస్. అయితే, ఈ సందర్భంగా ఓ మహిళ కేంద్రమంత్రిపై సిరాతో దాడి చేసింది. దీంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది.

కాసేపటి తర్వాత కేంద్రమంత్రి పరాస్ తన దుస్తులు మార్చుకున్నారు. కాగా, దళిత నేత, దివంగత రాంవిలాస్ పాశ్వాన్ స్థాపించిన ఎల్జేపీలో కొద్ది నెలల క్రితం తిరుగుబాటు జరిగింది. రాంవిలాస్ పాశ్వాన్ తమ్ముడైన పశుపతి పరాస్ ఇందుకు నాయకత్వం వహించారు. రాంవిలాస్ కుమారుడు, లోక్‌సభ సభ్యుడు చిరాగ్ పాస్వాన్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.

 Ink thrown at Union Minister Pashupati Paras in his constituency Hajipur, Bihar

చిరాగ్ తోపాటు ఆ పార్టీ తరపున ఆరుగురు లోక్‌సభ సభ్యులుండగా, అందులో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పాడ్డారు. అనంతరం పశుపతి పరాస్ ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్రమంత్రి వర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు. ఆహార ప్రాసెసింగ్, పరిశ్రమల మంత్రిత్వశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే చిరాగ్ పాశ్వాన్ మద్దతుదారు అయిన సదరు మహిళ.. కేంద్రమంత్రి, ఎల్జేపీ అధ్యక్షుడైన పశుపతి పరాస్‌పై సిరాతో దాడి చేసి నిరసన తెలిపింది. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మినహా ఏ ఒక్క పార్టీ అభ్యర్థి కూడా విజయం సాధించలేకపోయారు.

ఇది ఇలావుండగా, దివంగత ఎంపీ రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు కేటాయించిన 12 జన్‌పథ్‌ బంగ్లాలో నివసిస్తున్న ఆయన కుమారుడు, లోక్‌సభ ఎంపీ చిరాగ్‌ పాశ్వాన్‌ను ఆ ఇంటి నుంచి ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ ఇంటినే ప్రస్తుతం లోక్‌జనశక్తి పార్టీ తమ పార్టీ కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంటోంది.

దాదాపు 30 ఏళ్ల క్రితం నుంచి చిరాగ్‌ తండ్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఈ ఇంట్లో నివసించారు. ఆయన గతేడాది అక్టోబర్ నెలలో మరణించారు. కాగా, ఇల్లు మారాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై చిరాగ్‌ పాశ్వాన్‌ స్పందించలేదు. ప్రస్తుతం ఈ ఇంట్లో రామ్‌ విలాస్‌ భార్య, చిరాగ్‌పాశ్వాన్‌ కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+