మూడు దశాబ్ధాలుగా సేవ: ఎన్నో ప్రత్యేకతల ‘విరాట్’ రిటైర్మెంట్ నేడే
దాదాపు మూడు దశాబ్దాల పాటు భారత నావిక దళానికి అపూర్వమైన సేవలందించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విరాట్ ఇక విశ్రాంతి తీసుకోనుంది.
ముంబై: దాదాపు మూడు దశాబ్దాల పాటు భారత నావిక దళానికి అపూర్వమైన సేవలందించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విరాట్ ఇక విశ్రాంతి తీసుకోనుంది. సోమవారం ముంబైలో జరిగే విరమణ కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ విరాట్‌కు నావికదళ అధికారులు వీడ్కోలు చెప్పనున్నారు. నేవీ నుంచి పదవీ విరమణ పొందుతున్న రెండో నౌక ఐఎన్‌ఎస్ విరాట్. ఇప్పటికే ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నావికాదళం నుంచి ఉపసంహరించారు.

ఇక వీడ్కోలు
సోమవారం సాయంత్రం ఐఎన్‌ఎస్ విరాట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు నేవీ ఛీప్ సునిల్ లంబా ఓ మీడియా సంస్థకు తెలిపారు. అనంతరం ఈ నౌకను అమ్మకానికి పెడతామన్నారు. నాలుగు నెలల వరకు ఎవరూ కొనుగోలు చేయకపోతే.. నౌకను విడగొట్టి తుక్కుగా మారుస్తామని చెప్పారు. లేదంటే.. డైవర్లను ఆకర్షించేందుకు సముద్రంలో ముంచేసే ఆలోచనలో ఉన్నట్లు లంబా తెలిపారు.

మూడు దశాబ్దాల సేవలు..
1987 మే 12న ఐఎన్‌ఎస్ విరాట్ నేవిలో చేరింది. భారతకు అమ్మడానికి ముందు 1959 నుంచి 1984 వరకు ఈ నౌక హెచ్‌ఎంఎస్ హెర్మ్స్ పేరుతో బ్రిటిష్ రాయల్ నేవీలో సేవలందించింది.

మ్యూజియంగా మార్చాలని ఏపీ..
నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని మ్యూజియంలాగా మార్చాలని భావించింది. అయితే దీనికి వెయ్యి కోట్లు ఖర్చు కానుండటంతో వెనుకడుగు వేసింది. రిటైర్మెంట్ తర్వాత నౌకను గుజరాత్‌లోని అలాంగ్‌కు పంపే అవకాశం ఉంది.

11లక్షల కిలోమీటర్లు ప్రయాణం
ఇప్పటివరకు 11 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది ఐఎన్ఎస్ విరాట్. అంటే భూగోళాన్ని 27 సార్లు చుట్టివచ్చినన్నిసార్లన్నమాట. 1989లో శ్రీలంక శాంతి ప్రక్రియలో, 2001లో పార్లమెంట్‌పై దాడి తర్వాత ఆపరేషన్ పరాక్రమ్‌లో విరాట్ కీలకపాత్ర పోషించింది. సోమవారం సాయంత్రం అధికారిక వేడుక నిర్వహించి విరాట్‌కు వీడ్కోలు పలుకనున్నారు.

విరాట్ ప్రత్యేకతలు
ప్రపంచంలోనే అతి ప్రాచీన యుద్ధ నౌక ఇది. దేశంలో నిర్వహించిన అన్ని మేజర్ ఆపరేషన్లలో విరాట్ పాల్గొంది. విరాట్‌ను 1959లో బ్రిటీష్ రాయల్ నేవీ కోసం తయారు చేశారు. ఆ సమయంలో ఫాక్లాండ్ యుద్ధంలో విజయం సాధించడంతో విరాట్ సేవలకు గొప్ప పేరు వచ్చింది. ఆ తర్వాత 1987లో భారత నేవీలో అడుగుపెట్టింది. విరాట్ 743 అడుగుల పొడవు, 160 అడుగుల వెడల్పు, 29 అడుగుల ఎత్తు ఉంటుంది. 16సీ హ్యారియస్ జెట్స్, 4సీ కింగ్ కాప్టర్స్, 2చేతక్ చాపర్స్, 4 ధృవ చాప్టర్స్‌ను నిలిపే సామర్థ్యం విరాట్ సొంతం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications