ఇన్ స్టా లో కోటీశ్వరుడినని నమ్మించి.. 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు టోకరా.. వీడు మామూలోడు కాదు..!

కోటీశ్వరుడిగా నమ్మించి ఏకంగా 20 మహిళా కానిస్టేబుళ్లకు టోకరా వేశాడు ఓ యువకుడు. వారి నుంచి రూ. 24 లక్షల వరకు కాజేశాడు. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఇతడి వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుళ్లే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న 23 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. అలాగే నిందితుడు ఉత్తరప్రదేశ్‌ కు చెందిన విక్రాంత్ తోమర్‌ గా గుర్తించారు. అయితే తనను తాను బడా వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు 20 మంది మహిళా కానిస్టేబుళ్ల నుంచి సుమారు రూ. 24 లక్షలు కాజేసినట్లు దిల్లీ పోలీసులు విచారణలో వెల్లడైంది.

కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్‌ లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేసి నగదు కాజేశాడని ఆమె పోలీసులను ఆశ్రయించింది. అంతేకాక బెట్టింగ్ ప్లాట్‌ ఫామ్‌ లలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి రూ. 24 లక్షలు కాజేశాడు. తన దగ్గరున్న రూ.12 లక్షలతో పాటు మరో రూ. 12 లక్షలు లోన్ తీసుకొని మరీ అతనికి రూ. 24 లక్షలు ఇచ్చానని బాధిత మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ క్రమంలో పోలీసులు ఈ కేస్ ను సీరియస్ గా తీసుకుని బురారీ ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల విచారణలో నిందితుడు ఒకే బ్యాచ్ కు చెందిన మహిళా కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ వలలోకి దింపినట్లు తేలింది. ఇలా మొత్తం 19 మంది మహిళా కానిస్టేబుళ్లను ఇలా మోసం చేసినట్లు స్పష్టం అయింది. ఇక దుండగుడు వారిని నమ్మించేందుకు రెస్టారెంట్స్, భవనాల్లో విలాసవతమైన జీవితం గడుపుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. అంతేకాదు బాధితుల మనసు గెలుచుకునేందుకు కార్లను అద్దెకు తీసుకొని.. బయటకు తీసుకెళ్లేవాడని దర్యాప్తులో తేలింది.

Instagram new luxurious lifestyle 23 year old man swindles 20 female constables out of Rs 24 lakh

మరో ట్విస్టు ఏంటంటే..? ప్రస్తుతం అతడు సహజీవనం చేస్తున్న మహిళ కూడా కానిస్టేబులేనని పోలీసులు గుర్తించారు. ఆమె ద్వారానే మిగతా మహిళా కానిస్టేబుళ్ల గురించి తెలుసుకొని వారికి వల వేసి డబ్బులు దోచుకున్నట్టు దర్యాప్తులో అధికారులు తేల్చారు. అయితే మోసపోయిన బాధితుల్లో చాలామంది పరువు పోతుందన్న భయంతో ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+