ఎయిర్ కెనడా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 35మందికి గాయాలు
హవాయి : ఎయిర్ కెనడా విమానానికి పెను ప్రమాదం తప్పింది. వాంకోవర్ నుంచి సిడ్నీకి వెళ్తున్న ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అమెరికాలోని హోనోలూలు ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎయిర్ కెనడా విమానం 33 వాంకోవర్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన 2గంటలకు హవాయి ప్రాంతం గూండా ప్రయాణిస్తుండగా ఆకస్మాత్తుగా కుదుపులకు లోనైంది.
భారీ కుదుపుల కారణంగా ప్రయాణీకుల తలలు సీలింగ్‌కు తాకాయి. దీంతో 35మంది ప్యాసింజర్లకు స్వల్ప గాయాలయ్యాయి. విమానంలో ప్రయాణీకులు భయంతో కేకలు వేశారు. దీంతో ఒక్కసారికి అలజడి మొదలైంది. కుదుపుల కారణంగా పైలెట్ విమానాన్ని హోనోలూలులోని డేనియల్ కె ఇనోయీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

ఘటన జరిగిన సమయంలో విమానంలో 269మంది ప్రయాణీకులతో పాటు 13మంది ఫ్లైట్ సిబ్బంది ఉన్నారు. ఫ్లైట్ కుదుపులకు లోనైన సమయంలో అది 36వేల అడుగుల ఎత్తులో ఉంది. హోనోలూలు ఎయిర్‌పోర్టులో ల్యాండైన అనంతరం గాయపడిన ప్రయాణీకులకు చికిత్స అందించారు. అధికారులు ప్రయాణ సమయంలో విమానం కుదుపులకు లోనవడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications