మతాంతర వివాహం: ప్రాణాలతో వదిలేయాలని యువజంట మనవి, ఆ చావులు మాకు వద్దు!
కొచ్చి: ప్రేమ వివాహం అనేది రెండు జీవితాలకు సంబంధించిన విషయం. కేరళలో ఇప్పుడు రెండు మతాలకు చెందిన యువతీ యువకుడు వివాహం చేసుకోవడంతో వారిని చంపేస్తామని ఓ పార్టీ కార్యకర్తలు, యువతి కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. మమ్మల్ని ప్రాణాలతో వదిలేయాలని యువజంట మనవి చేసింది. కేరళలో ఇటీవల జరిగిన మర్యాదహత్య దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.
ప్రేమికుడి దారుణ హత్య
కేరళలో మర్యాదహత్యలు ఇటీవల ఎక్కువ అయ్యాయి. తనకంటే ఎక్కువ జాతి, ఆస్తి అంతస్తులో తన కంటే ఎక్కువ అయిన యువతిని ఇటీవల కెవిన్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం జీర్ణించుకోలేని యువతి సోదరుడు కెవిన్ ను అతి కిరాతకంగా హత్య చెయ్యడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.

ముస్లీం, క్రిస్టియన్
కేరళలోని హ్యారిస్ ప్రాంతానికి చెందిన క్రిస్టియన్ యువకుడు హ్యారిస్, ముస్లీం మతానికి చెందిన సహనా అనే యువతి ప్రేమించుకుని బుధవారం మతాంతర వివాహం చేసుకున్నారు. అయితే హ్యారిస్, సహనా ప్రేమ పెళ్లికి ఇప్పుడు మతం అడ్డుగా నిలిచింది.

చంపేస్తాంని బెదిరింపులు
ప్రేమ వివాహం చేసుకున్న తమను చంపేస్తామని ఎస్ డీపీఐ కార్యకర్తలు, సహనా కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని యువజంట ఫేస్ బుక్ లైవ్ లో ఆరోపించింది. తమకు చావడం ఇష్టం లేదని, ఎంతో ప్రేమగా ఇద్దరూ ఒక్కటి అయ్యామని, తమను ప్రాణాలతో విడిచి పెట్టాలని హ్యారీస్, సహనా వేడుకుంటున్నారు.

మతం మారలేదు వదిలేయండి
ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన సహనా తాను ముస్లీంగానే ఉన్నానని, మతం మారాలేదని, హ్యారీస్ తన మీద ఒత్తిడి చెయ్యలేదని, ఇష్టప్రకారం ఇద్దరూ వివాహం చేసుకున్నామని, మాపాటికి మమ్మల్ని వదిలేయాలని వేడుకుంది. మా కుటుంబ సభ్యులు, ఎస్ పీడీఐ కార్యకర్తల నుంచి మాకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని సహనా మనవి చేసింది.

అలాంటి చావు మాకు వద్దు
వీడియోలో హ్యారీస్ మాట్లాడుతూ తనను చంపేస్తామని సహనా కుటుంబ సభ్యులు, ఎస్ డీపీఐ కార్యకర్తలు బెదిరిస్తున్నారని ఆరోపించాడు. కెవిన్ లాగా చావడం తనకు ఇష్టం లేదని, ప్రేమ వివాహం చేసుకున్న మమల్ని వదిలేస్తే ఎక్కడికైనా దూరంగా వెళ్లి బతుకుతామని హ్యారీస్ వేడుకున్నాడు. ఈ యువ జంట ఫేస్ బుక్ లో తాము బతకాలని ఉందని మనవి చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.












Click it and Unblock the Notifications