ఇంటర్ విద్యార్థనిపై అత్యాచారం....... ప్రాణం పోయింది
బెంగళూరు: యువతిపై లైంగిక దాడి జరగడంతో మరణించిన సంఘటన పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయంలో జరిగింది. మృతి చెందిన యువతి కర్ణాటకలోని రాయచూరుకు చెందిన ఇంటర్ విద్యార్థిని. రాయచూరు పోలీసుల కథనం ప్రకారం... రాయచూరుకు చెందిన యువతి ఇంటర్ సెకండియర్ చదువుతోంది.
తెలంగాణలోని మహబూబ్ నగర జిల్లా జూరాల గ్రామానికి చెందిన రహం కుమార్ అదే కాలేజ్‌లో చదువుతున్నాడు. ఆదివారం యువతిని కిడ్నాప్ చేసిన రహం కుమార్ మంత్రాలయం తీసుకు వెళ్లాడు. మరో యువకుడు కూడా ఒక యువతిని తీసుకు వచ్చాడు. నలుగురు కలిసి వెళ్లారు.

ఆదివారం రాత్రి వీరు మంత్రాలయంలోని పుష్కర టూరిస్ట్ హోంలో రెండు గదులు అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో గదిలో ఉన్న ఇంటర్ విద్యార్థిని మీద రహం కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే పక్క గదిలో ఉన్న మరో యువతి సాయంతో మంత్రాలయంలోని ఆర్ ఎంపీ డాక్టర్ దగ్గరకు భాదితురాలిని తీసుకు వెళ్లి ప్రథమ చికిత్స చేయాలని కోరింది.
అయితే యువతి పరిస్థితి గుర్తించిన స్థానిక డాక్టర్ ఆమెను శ్రీ మంఠం ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని సూచించాడు. శ్రీ మంఠం వైద్యులు యువతిని రాయచూరు ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని చెప్పారు. ఆటోలో యువతిని రాయచూరు ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గం మద్యలో ప్రాణాలు విడిచింది.
ఎరిగెరె చెక్ పోస్ట్ దగ్గర విధులలో ఉన్న పోలీసులు ఆటోను పరిశీలించగా యువతి శవం కనపడింది. వెంటనే ఆటోను స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు. యువతి తెలిపిన వివరాల ఆదారంగా మంత్రాలయం వెళ్లిన పోలీసులు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతిపై లైంగిక దాడి చేసి ఆమె మరణానికి కారణం అయిన రహం కుమార్ తప్పించుకున్నాడు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications