Interesting video: ప్రధాని మోడీ స్వగ్రామంలో 2800 ఏళ్ల నాటి నిధి!!
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వగ్రామమైన గుజరాత్ లోని వాద్ నగర్ లో పురావస్తు శాఖ తవ్వకాలలో సుమారు 2008 వందల సంవత్సరాల నాటి నిధికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్ పూర్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా , ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ , జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మరియు డెక్కన్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తల కన్సార్టియం ఈ అధ్యయనం నిర్వహిస్తుంది.
ప్రధానమంత్రి స్వగ్రామమైన వాద్ నగర్ లో సాంస్కృతిక కొనసాగింపుకు సంబంధించిన అనేక అద్భుతమైన ఆధారాలు లభించాయి. వాద్ నగర్ లో జరుగుతున్న తవ్వకాలలో అనేక సంస్కృతులు, అనేక మతాలకు సంబంధించిన ఆధారాలు లభిస్తున్నాయి. బౌద్ధ, జైన, హిందూ, ఇస్లామిక్ రాజుల కాలం నాటి పాలనకు సంబంధించిన అనేక ఆధారాలు సేకరిస్తున్నారు. అక్కడ తవ్వకాలలో లోతైన కందకాలు బయటపడుతున్నాయి.

అందులో మౌర్యన్, ఇండో మౌర్యన్, ఇండో సిధియన్, అతి ప్రాచీన పర్షియన్ సామ్రాజ్యాలు, హిందూ సోలంకిస్, సుల్తాంకిస్, ప్రవెన్షియల్ గవర్నర్ ల వారసులకు సంబంధించిన ఏడు సాంస్కృతిక దశలకు సంబంధించిన ఆధారాలు లభ్యమవుతున్నాయి. తవ్వకాలలో పురాతన బౌద్ధ ఆరామం ఒకటి కనిపించింది. అంతేకాదు ఈ తవ్వకాలలో లక్షణమైన పురావస్తు కళాఖండాలు, కుండలు, రాగి, బంగారం, వెండి మరియు ఇనుప వస్తువులు, అద్భుతమైన కళాఖండాలు కనిపిస్తున్నాయి.
ఈ తవ్వకాలపై ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని జియాలజీ అండ్ జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ అనింద్యా సర్కార్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వాద్‌నగర్‌లో 2016 నుండి తవ్వకం పనులు కొనసాగుతున్నాయని, తమ బృందం సభ్యులు 20 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపిందని, ఇది బౌద్ధ, హిందూ, జైన, ఇస్లామిక్ స్థావరం అని చెప్పారు. చీకటియుగం లేదని ఈ తవ్వకాల ద్వారా తెలుస్తుందన్నారు.
వీటన్నిటినీ జాగ్రత్తగా సేకరించి వాద్ నగర్ లో భారతదేశంలోనే మొట్టమొదటి ప్రయోగాత్మక డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఈ అధ్యయనం కోసం నిధులు సమకూర్చింది. వాద్ నగర్, సింధు లోయ నాగరికత తెలుసుకోవటం కోసం జరుగుతున్న పరిశోధనలకు సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుండి కూడా నిధుల మద్దతు అందించింది. .












Click it and Unblock the Notifications