నాలుగేళ్లుగా మోడల్ బిడ్డపై ఇంటీరియర్ డిజైనర్ రేప్

సంఘటనపై 14 ఏళ్ల మైనర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జుహు పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్టు చేశారు. వృత్తిరీత్యా మోడల్ అయిన తల్లిని వెంటబెట్టుకుని బాధితురాలు పోలీసు స్టేషన్‌కు వచ్చింది.
బాధితురాలి తల్లి మొదటి భర్తకు విడాకులు ఇచ్చి నిందితుడిని 2008లో పెళ్లి చేసుకుంది. బాధితురాలు మొదటి భర్తకు పుట్టింది. 2010లో బాలిక శరీరాంగాలను స్పృశిస్తూ నిందితుడు అంధేరి నివాసంలో లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు.
విషయం తల్లికి చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు బాలికను బెదిరించాడు. దాంతో బాలిక మౌనంగా వేధింపులను భరిస్తూ వచ్చింది. చివరకు ఆదివారంనాడు ఆమె విషయాన్ని తల్లితో చెప్పింది. దాంతో తల్లి కూతురితో పోలీసు స్టేషన్‌కు వచ్చింది. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications