చిదంబరం కస్టడీ పొడిగింపు: తీహార్ జైలులో వెస్టర్న్ టాయ్ లెట్, ప్రత్యేక సెల్..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియాలో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఆయన కస్టడీని వచ్చే నెల 13వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కుహర్ ఆదేశాలు జారీ చేశారు. మరో రోజు చిదంబరం కస్టడీని పొడిగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం అధికారులు దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
ఈ నేపథ్యంలో- వచ్చే నెల 13వ తేదీ వరకు చిదంబరం తీహార్ కేంద్ర కారాగారంలోనే గడపాల్సి వచ్చింది. ఇదివరకు కంటే కొన్ని అదనపు సౌకర్యాలను కల్పించడానికి న్యాయమూర్తి అంగీకరించారు. తీహార్ జైలులో చిదంబరానికి ప్రత్యేక సెల్ ను కేటాయించాలని సూచించారు. ఆయన వయస్సు, వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని సకాలంలో మందులను అందించాలని ఆదేశించింది. ఇదివరకు కోరుకున్నట్టుగా వెస్టర్న్ టాయ్ లెట్ సౌకర్యాన్ని కల్పించేలా చర్యలు వెంటనే తీసుకోవాలని న్యాయమూర్తి తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునే వెసలుబాటును ఇదివరకే ఆయనకు కల్పించారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ కస్టడీని చిదంబరానికి ఊరట లభించిన విషయం తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన కేసు విచారణ నుంచి చిదంబరానికి బెయిల్ ను మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇదే కేసులో ఈడీ అధికారులు దాఖలు చేసిన కేసు నుంచి మాత్రం ఆయనకు ఊరట లభించట్లేదు. కస్టడీ ముగిసిన ప్రతీసారి దాన్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ అవుతున్నాయి. దీనిపై చిదంబరం తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐ నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీని పిటీషన్ కు జత చేశారు. ఢిల్లీ హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications