ఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఎట్టకేలకు ఆజ్ఞాతం వీడి ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు అంశాలు ప్రస్తావించారు. అసలు ఐఎన్‌ఎక్స్ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చిదంబరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో సీబీఐ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఆ నేపథ్యంలో అక్కడ హై డ్రామా నెలకొంది. సీబీఐ అధికారులు లోనికి రాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అదలావుంటే అక్కడి నుంచి చిదంబరం ఆయన నివాసానికి బయలుదేరారు.
Aug 21, 2019, 11:25 pm IST
బీజేపీ చేతిలో ప్రజస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా అన్నారు. మోడీ ప్రభుత్వం రెండోసారి గెలిచిన తర్వాత సీబీఐ, ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయినందుకు సిగ్గుపడుతున్నామని ట్వీట్ చేశారు.
The shameless witch-hunt & unheard of abuse of CBI/ED by Modi Govt 2.0 is playing on every TV screen in India.
It’s a sham and shame that democracy stands dead in the hands of the BJP. https://t.co/D0BoqhRr3l
చిదంబరంను తీసుకు వెళ్తుండగా ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు కారు వైపు దూసుక వచ్చారు. వారిని పోలీసులు తొలగించారు.
#WATCH Police remove the two men who jumped onto the car in which Congress leader P Chidambaram was being taken to the CBI headquarters today. #Delhipic.twitter.com/8buFkAY26U
తన తండ్రి చిదంబరం అరెస్టుపై కార్తి చిదంబరం మాట్లాడుతూ.. ఇదంతా బీజేపీ తప్ప ఎవరు చేస్తున్నారని, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారని భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Karti Chidambaram on being asked 'who is doing all this?', in Chennai: Yes, of course, all of this is being done by BJP. Who else? You think Donald Trump? No. #PChidambarampic.twitter.com/vWb72ymyJT
తన తండ్రి ఏ రోజు కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేయలేదని కార్తి చిదంబరం మండిపడ్డారు. 2008లో జరిగిన దానికి 2017లో కేసు నమోదు చేశారని, సమన్లు అందిన ప్రతిసారి విచారణకు హాజరయ్యారన్నారు.
Aug 21, 2019, 10:37 pm IST
తనపై రాజకీయ కక్షతో బీజేపీ విచారణ సంస్థలను ఉసిగొల్పుతుందని చిదంబరం ఆరోపించారు. ఆయన ప్రెస్ మీట్‌కు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
చిదంబరం ఇంటి ముందు 2 నిమిషాలు వేచిచూసిన సీబీఐ అధికారులు, చివరకు గోడ దూకి ఇంటిలోకి ప్రవేశం
Aug 21, 2019, 8:56 pm IST
చిదంబరం ఇంటికి చేరుకుంటున్న పార్టీ సీనియర్ నేతలు
Aug 21, 2019, 8:55 pm IST
చిదంబరం ఇంటికి చేరుకున్న ఈడీ, సీబీఐ అధికారులు
Aug 21, 2019, 8:55 pm IST
కాంగ్రెస్ కార్యాలయం నుంచి జోర్‌బాగ్‌లోని తన ఇంటికి వెళ్లిపోయిన చిదంబరం
Aug 21, 2019, 8:41 pm IST
హడావిడిగా ప్రెస్ మీట్ ముగించి వెళ్లిపోయిన చిదంబరం
Aug 21, 2019, 8:41 pm IST
ఐఎన్‌ఎక్స్ కేసుతో సంబంధం లేదన్న చిదంబరం
Aug 21, 2019, 8:40 pm IST
ఏఐసీసీ కార్యాలయం లోనికి సీబీఐ అధికారులు రాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అలర్ట్
Aug 21, 2019, 8:40 pm IST
ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్న కాంగ్రెస్ సీనియర్లు
READ MORE
9:04 AM, 21 Aug
రెండు గంటల్లోగా తమ ముందు హాజరుకావాలంటూ మంగళవారం రాత్రి చిదంబరం నివాసానికి సీబీఐ నోటీసులు అంటించింది.
Delhi: A Central Bureau of Investigation (CBI) team arrives at the residence of P Chidambaram. Yesterday, Delhi High Court had dismissed his both anticipatory bail pleas in connection with INX Media case. pic.twitter.com/t2kvpNfxCC
సీబీఐ, ఈడీ బృందాలు మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరంను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
9:14 AM, 21 Aug
అయితే సీబీఐ తీరుపై చిదంబరం తరపు న్యాయవాది తప్పుబట్టారు. రెండు గంటల్లోపు సీబీఐ ముందు హాజరుకావాలని చిదంబరం ఇంటికి నోటీసులు అంటించడంపై మండిపడ్డారు. ఏ చట్ట ప్రకారం తన క్లైంట్‌ను రెండుగంటల్లోగా సీబీఐ ఎదుట హాజరుకావాలన్నారని న్యాయవాది ప్రశ్నించారు.
Arshdeep Singh Khurana, P Chidambaram's lawyer, writes to CBI after CBI had put up a notice outside Chidambaram's residence: I am instructed to state that your notice fails to mention the provision of law under which my client has been issued a notice to appear within 2 hours. pic.twitter.com/xjUsGDGH6K
సుప్రీంకోర్టు ఈ కేసులో వాదనలు వినేంత వరకు చిదంబరంను అరెస్ట్ చేయవద్దంటూ ఆయన తరపు న్యాయవాది సీబీఐ, ఈడీలను కోరారు.
10:03 AM, 21 Aug
ప్రభుత్వం తప్పులు చిదంబరం ఎత్తిచూపుతున్నారు కనుకే ఆయనపై కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయి: ప్రియాంకా గాంధీ
An extremely qualified and respected member of the Rajya Sabha, @PChidambaram_IN ji has served our nation with loyalty for decades including as Finance Minister & Home Minister. He unhesitatingly speaks truth to power and exposes the failures of this government, 1/2
మోడీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగింది. ఇంత దారుణమైన ప్రభుత్వం భారత్‌లో మునుపెన్నడూ లేదు. ఏడు నెలలు తీర్పును రిజర్వ్‌లో ఉంచిన జడ్జి..రిటైర్ అయ్యే 72 గంటల ముందు తీర్పు ఇవ్వడమేంటి..?: రణదీప్ సూర్జేవాలా
India witnesses worst kind of virulent vendetta by Modi Govt as the BJP runs a police state.
Judge reserves judgement for 7 months & delivers it 72 hours before retirement, CBI/ED are sent to raid as a respected former FM is hounded.
సీజేఐ వద్దకు సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, వివేక్ .. అయోధ్య కేసు వాదనల్లో సీజేఐ రంజన్ గొగొయ్ బిజీ
4:39 PM, 21 Aug
అయోధ్య కేసు విచారణలో సుప్రీంకోర్టు సీజేఐ బిజీ. చిదంబరం పిటిషన్ విచారణపై లేని స్పష్టత
4:40 PM, 21 Aug
తనపై వస్తోన్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ధైర్యంగా ఎదుర్కొంటున్న చిదంబరాన్ని అభినందించిన శశిథరూర్
4:42 PM, 21 Aug
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం న్యాయ నిపుణుడు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన న్యాయంగానే పోరాడుతాడన్న డీఎంకే చీఫ్ స్టాలిన్
4:44 PM, 21 Aug
సుప్రీంకోర్టు నుంచి బయటకు వచ్చిన సీజేఐ గొగొయ్. అయితే తమ కేసుకు సంబంధించి రిజిష్టర్ కోసం వేచి చూస్తున్నామన్న చిదంబరం తరఫు లాయర్లు
4:45 PM, 21 Aug
చిదంబరం పిటిషన్ కోసం కోర్టు నంబర్ 1 వద్దకు వెళ్లానన్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. న్యాయ పరిధిలోని అంశంపై న్యాయంగానే ఉంటామని స్పష్టంచేసిన సిబల్
4:48 PM, 21 Aug
చిదంబరం తరఫు న్యాయవాదుల బృందం కానిస్టిట్యూషన్ గదిలో వేచి ఉన్నారు. చిదంబరం కేసు విచారించాలని రిజిస్టర్‌ను కోరుతున్నారు.
4:52 PM, 21 Aug
దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకొని తిరుగుతున్న చిదంబరం .. ఇన్నాళ్లు విజయ్ మాల్యా ఎలా తప్పించుకున్నారు. నీరవ్ మోడీ ఎలా తప్పించుకున్నారు. మెహుల్ చోక్సీ ఎలా తప్పించుకున్నారు అని ప్రశ్నించారు. ఇప్పుడు చిదంబరానికి సమయం వచ్చింది అని ట్వీట్ చేశారు.
4:55 PM, 21 Aug
చిదంబరం బెయిల్ పిటిషన్‌కు సంబంధించి ఆయన తరఫు న్యాయవాదులు పిల్ దాఖలు చేయకుండానే విచారిస్తామా అని సుప్రీంకోర్టు సీజేఐ ప్రశ్న
సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు. తమ నోటీసులపై చిదంబరం స్పందించలేదన్న సీబీఐ. అతనిని అదుపులోకి తీసుకొని విచారించాల్సి వస్తోందని వెల్లడి. ఇంతలో చిదంబరం విచారణకు సహకరిస్తారని ధీమా
Congress leader P Chidambaram suffered a major setback Tuesday as the Delhi High Court dismissed his anticipatory bail in the INX Media scam, paving way for the investigating agencies, CBI and ED, to arrest him.