ఐఎన్ఎక్స్ మీడియా కేసు: 5 వరకు చిదంబరం కస్టడీ పొడిగింపు, తీహార్‌కు వద్దు

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరంకు సెప్టెంబర్ 5 వరకు సీబీఐ కస్టడీని పొడిగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఇప్పటికైతే చిదంబరంను తీహార్ జైలుకు తరలించవద్దని ఆదేశించింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌కు వ్యతిరేకంగా మధ్యంతర బెయిల్ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన పిటిషిన్‌పై సెప్టెంబర్ 5వ తేదీని విచారణ జరుపుతామని తెలిపింది.

అప్పటి వరకు మరోసారి బెయిల్ గురించి ప్రస్తావించవద్దని స్పష్టం చేసింది. కాగా, తాము ఎలాంటి కస్టడీని కోరుకోవడం లేదని, ఆయనను జుడీషియల్ కస్టడీలో తీహార్ జైలుకు పంపాలని సీబీఐ.. కోర్టుకు తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు మాత్రం ఇందుకు అంగీకరించలేదు.

INX media case: SC directs Chidambaram to remain in CBI custody till Sep 5

కాగా, సోమవారం సుప్రీంకోర్టులో చిదంబరం కొంత ఊరట లభించింది. చిదంబరంను తీహార్ జైలుకు తరలించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీహార్ జైలుకు పంపకుండా చిదంబరంను హౌస్ అరెస్ట్ చేయాలని చిదంబరం తరపు న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థాన్ని కోరారు.

ఈ క్రమంలో చిదంబరం మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవాలని విచారణ కోర్టును అత్యున్నత న్యాయస్థానం కోరింది. అంతేగాక, సీబీఐ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది. దీంతో మరోసారి చిదంబరంకు నిరాశే ఎదురైంది.

ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమంగా విదేశీ పెట్టుబడుల తరలింపునకు సహకరించారనే ఆరోపణలతో చిదంబరంను గత కొద్ది రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో సీబీఐ చిదంబరంను అరెస్ట్ చేసింది. ఆనాటి నుంచి చిదంబరం సీబీఐ కస్టడీలోనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+