వ్యాఖ్యాతగా ఆజరుద్దీన్: హాట్ విరాట్ కోహ్లీకి కూల్ చిట్కాలు
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మణికట్టు మాంత్రికుడు మొహమ్మద్ అజరుద్దీన్ టీవీ వ్యాఖ్యాతగా దర్శనమిచ్చాడు. ఈ సమయంలో అతను విరాట్ కోహ్లీ టెంపర్‌మెంట్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ప్రవర్తన పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. సోనీ సిక్స్‌లో అజరుద్దీన్ వ్యాఖ్యాతగా దర్సనమిచ్చాడు.
విరాట్ అద్భుతమైన క్రికెటర్ అని, బ్యాట్స్‌మన్‌గా కోహ్లీని ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది గానీ టెంపర్‌ను కాదని ఆయన అన్నాడు. తప్పుడు ప్రవర్తనకు ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ పలుమార్లు వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్ కెప్టెన్‌గా ధోనీ స్తానంలో అతను నియమితుడయ్యాడు.

టెస్టు జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి మంచి అవకాశం వచ్చిందని, అయితే విరాట్ కోహ్లీ తన టెంపర్‌మెంట్‌ను నియంత్రించుకోలేకపోతే ప్రతిదీ దెబ్బ తినే ప్రమాదం ఉందని అజరుద్దీన్ అన్నాడు. పొట్టి క్రికెట్ జట్లకు ధోనీ అందుబాటులో ఉండగా, టెస్ట్ మ్యాచులకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఎంపిక చేయడం మంచి నిర్ణయమని అన్నాడు.
షారూక్ ఖాన్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కు చేరుకోలేకపోయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌కు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచుకు తారల ఆకర్షణ తగ్గలేదు. పాత, కొత్త తరాల నటులు ఈ మ్యాచును వీక్షించడానికి వచ్చారు. అనిల్ కపూర్ మ్యాచును వీక్షించడానికి వచ్చాడు రణవీర్ సింగ్, పర్షాన్ అక్తర్ కూడా వచ్చారు.
-
బాబూ.. నీ బౌలింగ్ కో దండం..! బుమ్రాకు నో చెప్పేసిన యువీ..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications