IPL 2023: కామెరాన్ గ్రీన్ సక్సెస్ కాలేడు..ముంబై ఇండియన్స్‌కు కష్టమే,ఎందుకో తెలుసా..?
అత్యంత భారీ ధర వెచ్చించి కామెరాన్ గ్రీన్‌ను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అయితే తన అంచనాలను అందుకుంటాడా అనే పెద్ద చర్చ ప్రారంభమైంది.
మరో పదిహేను రోజుల్లో భారత్‌లో పెద్ద క్రీడాపండగ జరగనుంది. అదే క్యాష్ రిచ్ గేమ్ ఐపీఎల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏ సీజన్‌కు ఆ సీజన్ ప్రత్యేకత చాటుతోంది. కొన్ని నెలల క్రితం జరిగిన మినీ వేలంలో ఫ్రాంఛైజీలు చాలా మంది స్టార్ క్రికెటర్లను భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశాయి. అలా భారీ ధర పలికిన వారిలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఒకడు. ముంబై ఇండియన్స్ ఈ ఆసీస్ ఆటగాడిపై రూ.17.50 కోట్లు వెచ్చించింది. ఇంత భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ జట్టును కామెరాన్ గ్రీన్ విజయతీరాలకు చేర్చగలడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని గణాంకాలు కూడా ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయి.
కామెరాన్ గ్రీన్.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్. ఈ ఐపీఎల్‌లో ది మోస్ట్ వాచ్‌డ్ క్రికెటర్. కేవలం 23 ఏళ్లున్న ఈ యువ క్రికెటర్ ఇతర దేశవాళీ క్రికెట్‌లో అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతాలే చేశాడు. దీంతో అంబానీ తనయుడి కళ్లు ఈ ఆటగాడిపై పడ్డాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అతని కోసం ఏకంగా రూ.17.50 కోట్లు వెచ్చించాడు. అంతేకాదు ముంబై ఇండియన్స్ యువతకు అవకాశాలు ఇవ్వడంలో ముందు వరసలో ఉంటుంది.

ఇలా అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ పెర్ఫార్మర్‌గా నిలిచి ఏకంగా జాతీయ జట్టుకే ప్రాతినిథ్యం వహించినవారున్నారు. అందులో చెప్పుకోదగ్గ వ్యక్తి సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున మెరుగైన ప్రదర్శన కనబర్చి ఏకంగా టీమిండియాలోనే చోటు సంపాదించాడు. అంతేకాదు ఇక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. ఇదంతా అటుంచితే కామెరాన్ గ్రీన్ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
కామెరాన్ గ్రీన్ బీభత్సమైన ఆల్‌రౌండర్ మాత్రమే కాదు..తన ఆటలో ఎంతో మెచ్యూరిటీ కనిపిస్తుంది.ఇదే ముంబై ఇండియన్స్ జట్టుకు వరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు భారీ మొత్తంలో గ్రీన్‌ను కొనుగోలు చేశారు. అయితే ఇలా భారీ మొత్తంలో అమ్ముడుపోయిన ఆటగాడు అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు గ్రీన్ ఆ రికార్డును చెరిపేస్తాడా లేదా అనేది చర్చనీయాంశమైంది. కామెరాన్ గ్రీన్ అత్యంత భారీ ధరకు అమ్ముడుపోయాడు. దీంతో సహజంగానే అతనిపై ఒత్తిడి ఉంటుంది. ఇలాంటివి గతంలో కూడా చూశాం.ఒకవేళ కామెరాన్ గ్రీన్ ఫెయిల్ అయితే... వచ్చే సీజన్‌లో అతని ధరపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే అతని ధర పడిపోవచ్చు.

ఇక కామెరాన్ గ్రీన్‌కు పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. ఇప్పటి వరకు కేవలం 8 టీట్వంటీలు, 13 వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే ఐపీఎల్‌లో ఈ అనుభవం ఎంతవరకు పనికొస్తుందనేది మరో చర్చ జరుగుతోంది. ఆడిన 8 టీట్వంటీల్లో కామెరాన్ 139 పరుగులు చేశాడు. 5 వికెట్లను పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో తొలిసారిగా ఆడనున్నాడు గ్రీన్. ఐపీఎల్‌లో అనుభవం ఉన్నవారికి ఆ గేమ్ యొక్క స్టాండర్డ్స్ పై అవగాహన ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన లీగ్‌గా ఐపీఎల్ టీ20 లీగ్‌కు గుర్తింపు ఉంది.అంత పెద్ద మొత్తంలో ధర పలికిన గ్రీన్ పై ఆ ఒత్తిడి ఎలాగు ఉండనే ఉంటుంది. ఎక్కడ ఏది బ్యాలన్స్ తప్పిన ముంబై ఇండియన్స్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టులో ఉన్న గ్రీన్ ఈ వాతావరణానికి అలవాటు పడ్డాడు. ఐపీఎల్‌లో కచ్చితంగా రాణిస్తానంటూ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications